PM Modi : ఆవులను పెంచడానికి బీజేపీ గర్వపడుతుంది..కొంతమంది ఎగతాళి చేస్తారు..కానీ ఆవుల ద్వారానే సంపాదిస్తారు

ఆవులను పెంచటానికి..వాటిని సంరక్షించటానికి బీజేపీ ప్రభుత్వం గర్వపడుతుందని..కొంతమంది ఆవులను ఎగతాళి చేస్తారు...కానీ ఆవులమీద సంపాదిస్తారని ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు

PM Modi : ఆవులను పెంచడానికి బీజేపీ గర్వపడుతుంది..కొంతమంది ఎగతాళి చేస్తారు..కానీ ఆవుల ద్వారానే సంపాదిస్తారు

Pm In Banas Dairy Sankul

PM in Banas Dairy Sankul: ఆవులను పెంచటానికి..వాటిని సంరక్షించటానికి బీజేపీ ప్రభుత్వం గర్వపడుతుందని..కానీ కొంతమంది ఆవులను ఎగతాళి చేస్తారు…కానీ ఆవుల మీద సంపాదిస్తారు అంటూ ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరుగునున్న క్రమంలో అధికార పార్టీ బీజేపీతో పాటు ప్రతిపక్షాలన్ని గెలుపు కోసం కసరత్తులు చేస్తున్నారు. సభలు..సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నాయి. ఈక్రమంలో ప్రధాని మోడీ గురువారం (డిసెంబర్ 23,2021)వారణాసి పర్యటనలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రూ.870.16 కోట్లకు పైగా వ్యయంతో 22 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వారణాసిలోని కార్ఖియాన్వ్‌లో రూ.1,225.51 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.2,100 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులను ప్రధానమంత్రి వారణాసి ప్రజలకు అంకితం చేశారు. 10 రోజుల్లో మోదీ తన నియోజకవర్గంలో పర్యటించడం ఇది రెండోసారి కావటం విశేషం.

Read more : Omicron: మూడో వేవ్ రాకుండా ఒమిక్రాన్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

ఈసందర్బంగా మోడీ ప్రసంగిస్తు..వారణాసి రైతులు, పశువుల పెంపకందారులకు ఈ రోజు గొప్ప రోజు అని అన్నారు. గోమాతలను సంరక్షించటానికి బీజేపీ ప్రభుత్వం ఎన్నో చేస్తోందని ఆవులను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం గర్వపడుతోందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఆవు, పేడ డబ్బు గురించి ఎగతాళిగా మాట్లాడారని అన్నారు. ఆవు కొంతమందికి కేవలం ఓ పశువుగానే చూస్తారు. కానీ మనకు ఆవు తల్లి. ఆవును ఎగతాళి చేసే వ్యక్తులు దేశంలోని 8 కోట్ల మంది ప్రజల జీవనోపాధి ఆవుల ద్వారానే నడుస్తోందన్న విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు.

Read more : Covid Vaccination In India : దేశంలో 60 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి

భారతదేశం ఏటా ఎనిమిదిన్నర లక్షల కోట్ల విలువైన పాలను ఉత్పత్తి చేస్తోందని ప్రధాని మోడీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. బనాస్ డెయిరీ ప్లాంట్ వల్ల పూర్వాంచల్‌లోని దాదాపు 6 జిల్లాల ప్రజలు ఉద్యోగాలు పొందడమే కాకుండా రైతులు, పశువుల యజమానులు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారని ప్రధాని మోడీ అన్నారు. మన ప్రాంగణంలో పశువులు ఉండటం శుభానికి సంకేతమని..ఆవు నా చుట్టూ ఉండాలి, నేను గోవులలో నివసించాలి అని మన గ్రంధాలలో కూడా చెప్పబడిందని గుర్తుచేశారు. పాడి పరిశ్రమ కోసం కామధేను కమిషన్‌ను ఏర్పాటు చేశామని, రైతులను కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో అనుసంధానం చేశామని ప్రధాని మోడీ తెలిపారు.