Bada Khana competition : 60 పూరీలు తిని త‌న రికార్డును తానే బ్రేక్ చేసిన కానిస్టేబుల్

యూపీలోని గొండా రిజ‌ర్వ్ పోలీస్ లైన్‌లో నిర్వ‌హించిన బ‌డా ఖానా పోటీలో 60 పూరీలు తిని త‌న రికార్డును తానే బ్రేక్ చేసాడు హెడ్ కానిస్టేబుల్ హృషీకేష్ రాయ్.

Bada Khana competition : 60 పూరీలు తిని త‌న రికార్డును తానే బ్రేక్ చేసిన కానిస్టేబుల్

Bada Khana Competition

Bada Khana competition in UP : ఓ పోలీస్ కానిస్టేబుల్ ఒకటీ రెండు కాదు 10లేదా 20 కూడా కాదు ఏకంగా 60 పూరీలు లాగించేశాడు. గతంలో 51 పూరీలు తిని రికార్డు క్రియేట్ చేసిన సదరు కానిస్టేబులు ఇప్పుడు ఏకంగా 60పూరీలు తిని తన రికార్డును తానే బ్రేక్ చేసి పారేశాడు. యూపీలోని గొండా రిజ‌ర్వ్ పోలీస్ లైన్‌లో నిర్వ‌హించిన బ‌డా ఖానా పోటీలో హెడ్ కానిస్టేబుల్ హృషీకేష్ రాయ్ 60 పూరీలు తిని త‌న రికార్డును తానే అధిగ‌మించాడు.

గొండా రిజ‌ర్వ్ పోలీస్ లైన్‌లో కొత్త రిక్రూట‌్ చేసుకునే వారితో పాటు ప్రస్తుత ఉద్యోగులు క‌లిసి భోజ‌నం చేసే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మం ఎప్ప‌టినుంచో ఆన‌వాయితీగా జ‌రుగుతోంది. దీంట్లో భాగంగా రిక్రూట్స్ పాసింగ్ అవుట్ ప‌రేడ్‌కు ముందు మంగ‌ళ‌వారం (జనవరి 5,2022) రాత్రి బ‌డా ఖానా పోటీ పెట్టారు.

Bride Dance Viral video : క‌త్రినా పాట‌కు వధువు డ్యాన్స్ చేస్తు..వరుడికి ప్రపోజ్..

ఈ పోటీలో ఎవరు ఎక్కువ పూరీలు తింటే వారిని సన్మానిస్తారు. అలా ఈ పోటీలో గతంలో 51 పూరీలు తిని రికార్డు క్రియేట్ చేసిన హృషీకేష్ రాయ్ అనే కానిస్టేబుల్ మరోసారి పోటీలో పాల్గొన్నారు. అతను పోటీలోకి వచ్చాడంటే ఇక తమపని అవుటే అనుకుంటారు మిగిలినవారు. అదే జరిగింది ఈ సారి కూడా. ఈసారి పోటీలో హృషీకేష్ రాయ్ ఏకంగా 60 పూరీల‌ను లాగించి త‌న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ పోటీలో గెలిచిన రాయ్‌కు రూ 1000 న‌గ‌దు బ‌హుమ‌తిని అధికారులు అందించారు. ఈ బ‌డా ఖానా ఈవెంట్‌కు సంబంధించి ఫోటోలు, వీడియోల‌ను గొండా పోలీసులు ట్వీట్ చేశారు.

ఈ బ‌డా ఖానా పోటీలో మొదటి బహుమతి మన పూరీ కింగ్ కు రాగా..48 పూరీలు తిన్న రిక్రూట్ కానిస్టేబుల్ అమిత్ కుమార్ సింగ్‌కు రెండ‌వ బ‌హుమ‌తి ల‌భించింది. ఈ పోటీలో గెలిచిన విజేత‌ల‌కు ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా న‌గ‌దు బ‌హుమ‌తులు అంద‌చేశారు. అధికారులు..కొత్తగా రిక్రూట్ అయినవారి మధ్య స‌న్నిహిత సంబంధాల‌ను..ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం కోసం ఇటువంటి కార్య‌క్ర‌మాల‌ను త‌ర‌చూ ఏర్పాటు చేయాల‌ని ఎస్పీ కోరారు.

Bollywood Movies: థర్డ్ వేవ్ తిప్పలు.. బాలీవుడ్‌కు మళ్ళీ గతేడాది పరిస్థితులు!