ఫస్ట్ డే ‘ఉప్పెన’ ఊపు ఊపిందిగా..

ఫస్ట్ డే ‘ఉప్పెన’ ఊపు ఊపిందిగా..

Uppena Day 1 Share: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కన్నడ బ్యూటీ కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఉప్పెన’.. ఫిబ్రవరి 12న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Uppena

అన్ని ఏరియాల నుండి మార్నింగ్ షో మొదలు మంచి టాక్ తెచ్చుకుంది. హీరో హీరోయిన్ల నటన, విజయ్ సేతుపతి విలనిజం, దేవి శ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని దర్శకుడు ఎమోషనల్‌గా తెరకెక్కించాడంటూ ప్రశంసిస్తున్నారందరూ.

https://10tv.in/uppena-team-celebrating-stellar-response-at-the-box-office/

ఇక ‘ఉప్పెన’ కలెక్షన్లు కూడా ‘ఉప్పెన’ లానే వచ్చాయి. ఫస్ట్ డే ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల భారీ షేర్ రాబట్టింది. ఒక డెబ్యూ హీరో సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో షేర్ రావడం అంటే చిన్న విషయం కాదని ట్రేడ్ వర్గాల వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదే ఫ్లో కనుక కంటిన్యూ అయితే సుకుమార్ చెప్పినట్టు రూ.100 కోట్లు వసూలు చేసినా చెయ్యొచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. ఏరియాల వారీగా ‘ఉప్పెన’ తొలిరోజు షేర్ వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం : రూ.3.08 కోట్లు

వైజాగ్ : రూ. 1.43 కోట్లు

ఈస్ట్ : రూ. 0.98 లక్షలు

వెస్ట్ : రూ. 0.81 లక్షలు

కృష్ణా : రూ. 62 లక్షలు

గుంటూరు : రూ. 65 లక్షలు

నెల్లూరు : రూ. 35 లక్షలు

సీడెడ్ : 1.35 కోట్లు

ఏపీ+తెలంగాణ : రూ. 9.3 కోట్లు

ఓవర్సీస్ : రూ. 34 లక్షలు

కర్ణాటక : రూ. 52 లక్షలు

తమిళనాడు : రూ. 16 లక్షలు

రెస్టాఫ్ ఇండియా : రూ. 10 లక్షలు.