ప్రేమంటే పట్టుకోవడం.. వదిలెయ్యడం కాదు.. ‘ఉప్పెన’లో సముద్రమంత ప్రేమ..

ప్రేమంటే పట్టుకోవడం.. వదిలెయ్యడం కాదు.. ‘ఉప్పెన’లో సముద్రమంత ప్రేమ..

Uppena: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ప్రోమోస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. పాటలకు బ్రహ్మాండమైన స్పందన లభించింది. ‘నీకన్ను నీలి సముద్రం’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. గురువారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఉప్పెన’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

‘ప్రేమంటే ఓ లైలా-మజ్ఞులా, దేవదాసు-పార్వతిలా, రోమియో-జూలియట్‌లా అదో మాదిరిలో ఉండాలిరా’.. అటే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆశీ, బేబమ్మ, రాయణం ఈ మూడు పాత్రల చుట్టూ జరిగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ‘ఉప్పెన’ ఉండబోతోందని.. ఓ అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడడం, అమ్మాయి తండ్రి దాన్ని సహించకపోవడం.. వాళ్లిద్దరిని విడదియ్యడానికి ఎలాంటి క్రూరమైన పనులు చేశాడనేది ట్రైలర్‌లో చూపించారు.

వైష్ణవ్, కృతి శెట్టిల కెమిస్ట్రీ క్యూట్‌గా ఉంది. ఇక హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్‌లో ప్రముఖ తమిళ కథానాయకుడు, విలక్షణ నటుడు విజయ సేతుపతి అదరగొట్టేశారు. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే భయపెట్టేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్, శ్యామ్ దత్ సైనుద్దీన్ విజువల్స్ సింప్లీ సూపర్బ్.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ సముద్రమంత ప్రేమను పంచడానికి థియేటర్లలోకి రానుంది.