Palwancha Issue : వనమా రాఘవేంద్ర అరెస్టు…టీఆర్ఎస్ నుంచి సస్పెండ్

వనమా రాఘవపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దమ్మపేట వద్ద.. రాఘవను అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్‌ దత్‌ ధ్రువీకరించారు.

Palwancha Issue : వనమా రాఘవేంద్ర అరెస్టు…టీఆర్ఎస్ నుంచి సస్పెండ్

Vanama Raghavednra

Vanama Raghavendra Rao Arrested : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచకు చెందిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో.. వనమా రాఘవపై ఆరోపణలున్నాయి. రామకృష్ణ సూసైడ్‌ లెటర్‌, సెల్ఫీ వీడియో ఆధారంగా.. వనమా రాఘవపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దమ్మపేట వద్ద.. రాఘవను అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్‌ దత్‌ ధ్రువీకరించారు. రామకృష్ణ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రపై టీఆర్ఎస్‌ అధిష్టానం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది. వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

Read More : SBI : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈ నెల 3న మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు.. వనమా రాఘవేంద్రరావు అలియాస్‌ రాఘవను పోలీసులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నాటకీయ పరిణామాల నడుమ రాఘవ పోలీసులకు చిక్కాడు. కొద్దిరోజులుగా తొర్రూరు, హైదరాబాద్‌, సూర్యాపేట, చీరాల, విశాఖపట్నం, రాజమండ్రికి ప్రయాణాలు సాగించినట్లు తెలిసింది. ఒక్కోచోట ఒక్కో సిమ్‌ర్డును మార్చుతూ పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తపడ్డాడు. విశాఖలో రెండురోజులపాటు తలదాచుకున్న రాఘవ.. శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో దమ్మపేట సమీపంలో భద్రాద్రి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని పాల్వంచ ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. అతడితో పాటు పాల్వంచ మండలానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Read More : Telangana Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు

అర్ధరాత్రి సమయంలో.. రాఘవను కొత్తగూడెం తరలించారు పోలీసులు. వనమా రాఘవ బెదిరింపుల కారణంగా రామకృష్ణ ఈ నెల 3న తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన.. తెలుగురాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకునే క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తగా వనమా రాఘవ అందులో తలదూర్చాడని, తన భార్యను హైదరాబాద్‌ తీసుకువచ్చి అప్పగిస్తే ఆస్తి దక్కేలా చూస్తానని బేరం పెట్టాడని.. ఈ అవమానం భరించలేక కుటుంబ సమేతంగా చనిపోతున్నానన్న బాధితుడు సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.

Read More : SBI KYC : ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులతో జాగ్రత్త.. ఇలా రిపోర్ట్ చేయండి..

వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేయాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విపక్షాలు బంద్‌ పాటించాయి. పలుచోట్ల విపక్ష నేతల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నేతలు రోడ్డుపై బైఠాయించారు. వనమా రాఘవను అరెస్ట్‌ చేయాలని, ఆయన తండ్రి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.