RJ Kajal :: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో.. RJ కాజల్‌కి కౌంటర్ ఇచ్చిన వరుణ్ సందేశ్..

బిగ్ బాస్ లో సన్నీ, కాజల్ ఎంత క్లోజ్ గా ఉన్నారో అందరికి తెలుసు. బిగ్ బాస్ లో వారు మంచి మిత్రులుగా మారారు. దీంతో ఆ స్నేహంతోనే ఆర్జే కాజల్‌ 'సకల గుణాభిరామ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి...

RJ Kajal ::  ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో.. RJ కాజల్‌కి కౌంటర్ ఇచ్చిన వరుణ్ సందేశ్..

Rj Kajal

Varun sandesh :  తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ హీరోగా చేస్తున్న ‘సకలగుణాభిరామ’ రానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి విశ్వక్ సేన్, అనిల్ రావిపూడిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరితో పాటు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ అందరూ, గత సీజన్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది కూడా హాజరయ్యారు. వారంతా కలిసి సన్నీ సినిమాని ప్రమోట్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఆర్జే కాజల్‌ హోస్ట్‌గా నిర్వహించింది.

బిగ్ బాస్ లో సన్నీ, కాజల్ ఎంత క్లోజ్ గా ఉన్నారో అందరికి తెలుసు. బిగ్ బాస్ లో వారు మంచి మిత్రులుగా మారారు. దీంతో ఆ స్నేహంతోనే ఆర్జే కాజల్‌ ‘సకల గుణాభిరామ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి యాంకర్ గా చేసింది. అయితే ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ కూడా వచ్చాడు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. సన్నీ తనకు చాలా సంవత్సరాల నుంచి తెలుసని, సన్నీతో ఉన్న అనుబంధం గురించి చెప్పాడు. బిగ్‌బాస్‌తో సన్నీ అందరి మనసులు గెలుచుకున్నాడని చెప్పి సకల గుణాభిరామ సినిమా టీం అందరికి ఆల్‌ ది బెస్ట్‌” చెప్పాడు.

Lata Mangeshkar : స్కూలుకే వెళ్లని లతా మంగేష్కర్.. ఎన్ని భాషలు వచ్చో తెలుసా?

అయితే వరుణ్ మాట్లాడి కిందకి వెళ్లిపోతుంటే ఆర్జే కాజల్‌ ”వరుణ్.. నీ ఇందువదన సినిమాకి కూడా ఆల్ ది బెస్ట్” అని చెప్పింది. అయితే వరుణ్‌.. ” ఆల్రెడీ ఆ సినిమా రిలీజ్ అయి చాలా రోజులైంది” అని అన్నాడు. దీంతో కాజల్ తన తప్పు తెలుసుకొని ”సారీ.. మర్చిపోయాను.. కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి” అని కవర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏమి తెలుసుకోకుండా, అప్డేట్ లో లేకుండా ఎలా ఉంటారు అంటూ నెటిజన్లు ఆర్జే కాజల్‌ ని ట్రోల్ చేస్తున్నారు.