HIT 2: హిట్-2 సక్సెస్ పై వెంకటేశ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?

టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ సీక్వెల్ మూవీగా వచ్చిన ‘హిట్-2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన తీరు.. యంగ్ హీరో అడివి శేష్ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన తీరు.. కలగలిసి ఈ సినిమాను ఆడియెన్స్ ఆదరించేలా చేశాయి. ఇక దర్శకుడు ఈ సినిమాకు ఎంచుకున్న సబ్జెక్ట్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది.

HIT 2: హిట్-2 సక్సెస్ పై వెంకటేశ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?

Venkatesh Lauds HIT 2 For Its Success

HIT 2: టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ సీక్వెల్ మూవీగా వచ్చిన ‘హిట్-2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన తీరు.. యంగ్ హీరో అడివి శేష్ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన తీరు.. కలగలిసి ఈ సినిమాను ఆడియెన్స్ ఆదరించేలా చేశాయి. ఇక దర్శకుడు ఈ సినిమాకు ఎంచుకున్న సబ్జెక్ట్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది.

HIT 2: యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో చెడుగుడు ఆడేస్తున్న ‘హిట్-2’

హిట్ 2 సినిమా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. పలువురు సెలెబ్రిటీలు సైతం ఈ సినిమాను చూసి చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి నందమూరి బాలకృష్ణ తనదైన విషెస్ చెప్పగా, తాజాగా ఈ సినిమాను చూసిన మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని ఆయన అన్నారు.

HIT 2: అడివి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2

ఇలా హిట్-2 సినిమాపై విక్టరీ వెంకటేశ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన వెంకటేశ్‌కు హీరో అడివి శేష్, దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాత నాని థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.