Vijay Devarakonda : వాలీబాల్ టీం ఓనర్‌గా లైగర్..

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. చివరిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని ఎదురుకుంది. తాజాగా మరోసారి విజయ్ స్పోర్ట్స్ వైపు ఆసక్తి చూపుతున్నాడు. అయితే..

Vijay Devarakonda : వాలీబాల్ టీం ఓనర్‌గా లైగర్..

vijay devarakonda

Updated On : January 25, 2023 / 8:52 AM IST

Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. చివరిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని ఎదురుకుంది. తాజాగా మరోసారి విజయ్ స్పోర్ట్స్ వైపు ఆసక్తి చూపుతున్నాడు. అయితే ఈసారి స్క్రీన్ మీద ఆడడం కాదు డైరెక్ట్ గ్రౌండ్ లోకి దిగి ఆడిస్తా అంటున్నాడు. షారుఖ్ ఖాన్ మాదిరి విజయ్ దేవరకొండ కూడా ఒక స్పోర్ట్స్ టీంకి ఓనర్ కాబోతున్నాడు.

Vijay Devarakonda: ‘ఖుషి’ని పక్కనబెట్టి ఆటలాడుతానంటోన్న దేవరకొండ.. నిజమేనా?

‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ అనే వాలీబాల్ టీంకి విజయ్ దేవరకొండ కో ఓనర్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ‘తెలుగు ప్రజలారా మన రెండు స్టేట్స్ కి ఒక కొత్త టీం వచ్చింది ‘బ్లాక్ హాక్స్ హైదరాబాద్’. ఈ టీంకి ఒక కొత్త ఓనర్ వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈసారి 2023 ప్రైమ్ వాలీబాల్ లీగ్ లో తప్పకుండా కప్ కొడదాం. నా టీంకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి’ అంటూ వెల్లడించాడు. మరి లైగర్ సినిమాతో ప్లాప్ అయ్యిన ఈ హీరో.. రియల్ లైఫ్ లో స్పోర్ట్స్ తో విజయం అందుకుంటాడా? లేదా? చూడాలి.

కాగా ప్రస్తుతం విజయ్ ఖుషి, గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి మూవీలో విజయ్ పోలీస్ స్పైగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో రానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మొదలుపెట్టి సగ భాగం షూటింగ్ జరుపుకున్న ‘ఖుషి’ సినిమా సెట్స్ పైకి వెళ్లడం లేదు. లవ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె అనారోగ్యం కారణంగా మూవీ షూటింగ్ లేటు అవుతూ వస్తుంది.