Vijay Devarakonda : లైగర్ తర్వాత విజయ్ మారిపోయాడా? బేబీ సక్సెస్ మీట్‌లో విజయ్ స్పీచ్ వైరల్.. యాటిట్యూడ్ పక్కన పెట్టాడా?

సాధారణంగా విజయ్ స్పీచ్ లు ఇచ్చేటప్పుడు వాట్సాప్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ అరుస్తూ మాట్లాడతాడు. కానీ బేబీ సినిమా సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అందరికి నమస్కారం అంటూ పద్దతిగా మొదలుపెట్టాడు స్పీచ్.

Vijay Devarakonda : లైగర్ తర్వాత విజయ్ మారిపోయాడా? బేబీ సక్సెస్ మీట్‌లో విజయ్ స్పీచ్ వైరల్.. యాటిట్యూడ్ పక్కన పెట్టాడా?

Vijay Devarakonda speech in Baby Movie Success Meet goes Viral

Vijay Devarakonda Speech :  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఆ సినిమా నుంచే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తన సినిమాల కంటే కూడా తన స్పీచ్ లతో, తన యాటిట్యూడ్ తో, తన యారగెంట్ తోనే బాగా పాపులర్ అయ్యాడు విజయ్. ఫుల్ యాటిట్యూడ్ తో తాను చేసిన స్పీచ్ లు, ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్ని వైరల్ అయ్యాయి. దీంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

అయితే మొదటి నుంచి కూడా విజయ్ స్పీచ్ లపై, అతని యాటిట్యూడ్ పై విమర్శలు వస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ లైగర్ సినిమా సమయంలో మాత్రం ఈ యాటిట్యూడ్ మరింత ఎక్కువైంది. ప్రతి ఇంటర్వ్యూలో, ఈవెంట్ స్పీచ్ లలో అతను ఇచ్చిన స్పీచ్ లలో గర్వం, యాటిట్యూడ్ కనిపించింది. ప్రమోషన్స్ లో అడిగే ప్రశ్నలకి కూడా అలాగే సమాధానాలు ఇచ్చాడు. దీంతో లైగర్ సినిమా సమయంలో విజయ్ పై విమర్శలు బాగా వచ్చాయి. ఇక లైగర్ సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వడం, విజయ్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా విజయ్ పై ట్రోల్స్ పెరిగాయి. ఈ యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుపడతావు, గర్వం తగ్గించుకోవాలి, స్టార్ హీరోలు కూడా అలా మాట్లాడరు.. అంటూ విజయ్ పై దారుణమైన విమర్శలు చేశారు.

లైగర్ సినిమా తర్వాత చాలా రోజులు అసలు బయటకి రాలేదు. ఇక ప్రస్తుతం మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యాడు. తాజాగా విజయ్ దేవరకొండ బేబీ సినిమా సక్సెస్ మీట్ కి వచ్చాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు.

సాధారణంగా విజయ్ స్పీచ్ లు ఇచ్చేటప్పుడు వాట్సాప్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ అరుస్తూ మాట్లాడతాడు. కానీ బేబీ సినిమా సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అందరికి నమస్కారం అంటూ పద్దతిగా మొదలుపెట్టాడు స్పీచ్. ఈ స్పీచ్ కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంది. దాదాపు 10 నిముషాలు విజయ్ దేవరకొండ మాట్లాడినా ఎక్కడా కూడా ఓవర్ అనిపించకుండా, చాలా కూల్ గా, అందరికి గౌరవం ఇస్తూ, సినిమా తప్పు ఒప్పుల గురించి మాట్లాడుతూ, హిట్, ఫ్లాప్స్ గురించి మాట్లాడుతూ అందర్నీ మెప్పించాడు. దీంతో బేబీ సినిమా సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Taapsee : పెళ్లిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. పెళ్లి చేసుకోవడానికి నేనేమన్నా ప్రగ్నెంట్ నా?

ఈ స్పీచ్ చూసిన వాళ్లంతా అసలు ఇది మాట్లాడుతున్నది విజయ్ దేవరకొండనేనా, ఒక్కసారిగా ఇలా మారిపోయాడు ఏంటి అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఒక్క ఫ్లాప్ పడేసరికి మళ్ళీ రియల్ లైఫ్ తెలిసొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్ మారాడు అని, ఇలాగే ఉంటే కెరీర్ బాగుంటుందని లేకపోతే మళ్ళీ లైగర్ సినిమా టైంలో లాగా యాటిట్యూడ్ గా మాట్లాడితే విమర్శలు తప్పవని కామెంట్స్ చేస్తున్నారు.