Thalapathy 67: ‘లియో’ బ్లడీ స్వీట్ అంటూ టైటిల్ రివీల్ ప్రోమోతో దూసుకొచ్చిన విజయ్..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని థళపతి 67 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ లాంచ్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించగా, తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్.

Thalapathy 67: ‘లియో’ బ్లడీ స్వీట్ అంటూ టైటిల్ రివీల్ ప్రోమోతో దూసుకొచ్చిన విజయ్..!

Vijay Thalapathy 67 Movie Titled Leo

Thalapathy 67: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని థళపతి 67 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ లాంచ్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించగా, తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్.

Thalapathy 67: బాబోయ్.. లోకేశ్ కనగరాజ్ స్పీడ్ మామూలుగా లేదుగా.. అప్పుడే థళపతి 67 టైటిల్ అనౌన్స్‌మెంట్..!

లోకేశ్ కనగరాజ్ మరోసారి తనదైన ఫార్మాట్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఈ టైటిల్ రివీల్ ప్రోమో వీడియో చూస్తే అర్థమవుతోంది. లోకేశ్ మార్క్ హీరో ఎలివేషన్‌తో ఈ టైటిల్ రివీల్ ప్రోమోను కట్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దూసుకొస్తున్న విలన్లకు చుక్కలు చూపించేందుకు హీరో ఓ కత్తిని చాక్లెట్ క్రీమ్‌లో ముంతి తీసి, తన వేలితో టేస్ట్ చేస్తాడు. బ్లడీ స్వీట్ అంటూ విజయ్ చెప్పడంతో ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘లియో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.

Thalapathy 67: పూజా కార్యక్రమాలతో థళపతి 67ను మొదలుపెట్టిన విజయ్..!

ఇలా విజయ్ నటిస్తున్న 67వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను లోకేశ్ కనగరాజ్ రివీల్ చేసిన విధానం ప్రేక్షకుల్లో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోండగా, అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా.. ఎప్పుడెప్పుడు రిలీజ్‌ను అనౌన్స్ చేస్తారా అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో నెలకొంది.