Virat Kohli: ‘కోహ్లీ టీ20 కెప్టెన్సీ రాజీనామా.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఏదో జరుగుతున్నట్లే..’

బయో బబుల్ పై పాకిస్తాన్ టెస్ట్ లెగ్ స్పిన్నర్ ముస్తఖ్ అహ్మద్ ఆరోపణలు గుప్పిస్తూ.. వరల్డ్ కప్ టోర్నీ నుంచి టీమిండియా ముందే వెళ్లిపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు.

Virat Kohli: ‘కోహ్లీ టీ20 కెప్టెన్సీ రాజీనామా.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఏదో జరుగుతున్నట్లే..’

Dressing Room

Virat Kohli: విరాట్ కోహ్లీ టీ20కెప్టెన్సీకి రాజీనామా ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయో బబుల్ పై పాకిస్తాన్ టెస్ట్ లెగ్ స్పిన్నర్ ముస్తఖ్ అహ్మద్ ఆరోపణలు గుప్పిస్తూ.. వరల్డ్ కప్ టోర్నీ నుంచి టీమిండియా ముందే వెళ్లిపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో టీ20కెప్టెన్సీకి విరామం ఇస్తున్నట్లు ప్రకటించాడు.

‘కెప్టెన్ గా సక్సెస్ ఫుల్ గా ఉన్న సమయంలో కెప్టెన్సీకి విరామం ప్రకటించాడంటే డ్రెస్సింగ్ రూంలో ఏదో జరుగుతుంది. ఇప్పుడు నాకు డ్రెస్సింగ్ రూంలో రెండు గ్రూపులు కనిపిస్తున్నాయి. ఒకటి ముంబై గ్రూప్, రెండు ఢిల్లీ గ్రూప్’ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హై పర్ ఫార్మెన్స్ సెంటర్ లో పనిచేస్తున్న ముస్తఖ్ చెప్తున్నాడు.

సోమవారం జరిగిన నమీబియాతో టీ20 మ్యాచ్ కు చివరిసారిగా కెప్టెన్సీ వహించాడు కోహ్లీ. దీనిని బట్టి చూస్తుంటే టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పుకొచ్చాడు.

……………………………………………… : తమిళనాడు, ఏపీకి భారీ వర్ష సూచన

‘టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి కోహ్లీ త్వరలోనే రిటైర్ అవుతాడని అనుకుంటున్నా. ఐపీఎల్ మాత్రం కంటిన్యూ అవుతాడు. టీమిండియా వరల్డ్ కప్ లో ఫెయిల్ అవడానికి కారణం ఐపీఎల్. ఎందుకంటే ప్లేయర్లంతా బయో సెక్యూర్ బబుల్ లో ఉండిపోయి వరల్డ్ కప్ కు ముందు అలసిపోయారు. అని అంటున్నాడు ముస్తఖ్.

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హఖ్ కూడా టీమిండియా ఐపీఎల్ కారణంగా మెంటల్ గా ఇబ్బందులు ఎదుర్కొందని అన్నాడు. ప్లేయర్లంతా మనుషులేనని అలా ఎక్కువ కాలం బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో ఉంచడం ఈజీ కాదని అన్నాడు.