India Weather : తమిళనాడు, ఏపీకి భారీ వర్ష సూచన

తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధవారం, గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.

India Weather : తమిళనాడు, ఏపీకి భారీ వర్ష సూచన

Sitee11

Tamil Nadu And Andhra Pradesh : తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధవారం, గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంపై అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదిలి గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.

Read More : India : మోదీ మరో రికార్డు..వరల్డ్ నెంబర్ 2

ఏపీలోని దక్షిణ కోస్తా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. తమిళనాడులో గురువారం వరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట్, కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్ , మైలాడుతురై జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు బుధ, గురువారం సెలవు ప్రకటించింది. మొత్తం 19 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

Read More : Falaknuma Dancer : డ్యాన్స్ ఆపేస్తే పెళ్లి చేసుకుంటా..పాతబస్తీ డ్యాన్సర్ హత్య కేసు

ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. చెన్నై జలదిగ్బంధంలో ఉంది. ఇప్పటివరకు వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు. భారీ వర్షాలకు 530కి పైగా పూరిళ్లు కూలిపోయాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. వరద నీటిని 23 వేల మంది కార్పొరేషన్ సిబ్బంది తోడేస్తున్నారు. సహాయ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులను ఆదేశించారు. సహాయక శిబిరాల్లోనే 5 వేల కుటుంబాలు తలదాచుకుంటున్నాయి.