India : మోదీ మరో రికార్డు..వరల్డ్ నెంబర్ 2

ప్రపంచ నాయకుల్లో అత్యధికంగా 70 శాతం రేటింగ్‌తో  గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మరో ఘనత సాధించారు.

India : మోదీ మరో రికార్డు..వరల్డ్ నెంబర్ 2

Modi Twitter

Modi Created Another Record : భారత ప్రధాని మోదీ మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ప్రపంచ నాయకుల్లో అత్యధికంగా 70 శాతం రేటింగ్‌తో  గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మరో ఘనత సాధించారు. తాజాగా నిర్వహించిన మరో సర్వేలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సామాజిక మాధ్యమం ట్విటర్‌లో 2021కు గానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ రెండవ స్థానంలో నిలిచారు. వినియోగదారుల నిఘా కంపెనీ బ్రాండ్‌వాచ్‌ తమ వార్షిక సర్వే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా గాయని టేలర్‌ స్విఫ్ట్‌ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు.

Read More : Today Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధరలు

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు సైతం ఈ జాబితాలో చోటుదక్కింది. ప్రముఖ హాలీవుడ్‌ నటులు డ్వేన్‌ జాన్సన్, లియోనార్డో డికాప్రియో సహా అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాను వెనక్కినెట్టి సచిన్‌ 35వ స్థానంలో నిలిచారు. దశాబ్దకాలంగా సచిన్‌ యునిసెఫ్‌ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, 2013లో ఆ సంస్థ దక్షిణాసియా రాయబారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సచిన్‌ సేవలను బ్రాండ్‌వాచ్‌ కొనియాడింది. అణగారిన వర్గాల కోసం గళం విప్పుతూ గొప్పగా పని చేస్తున్నారని, నిర్దిష్టమైన లక్ష్యాల కోసం పని చేస్తున్నారని ప్రశంసించింది. సచిన్‌ నుంచి స్ఫూర్తి పొంది ఆయన అభిమానులు కూడా ఆ సేవలను కొనసాగిస్తున్నారని బ్రాండ్‌వాచ్‌ పేర్కొంది.