Today Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధరలు

పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో త్వరలో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు భావిస్తున్నారు.

Today Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధరలు

Gold Prices Today

Today Gold Price : బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం వివిధ పట్టణాల్లో పెరిగిన బంగారం ధర.. ఈ రోజు తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో త్వరలో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు భావిస్తున్నారు. ఇక బంగారం కొనుగోళ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్కెట్లోకి వస్తున్న కొత్త మోడల్ నగలు మగువలను ఆకర్షిస్తుండం.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా బుధవారం (నవంబర్‌ 10)న బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,270 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,390 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,100గా ఉంది.

ఇక వెండి ధర విషయానికి వేస్తె..

ఢిల్లీలో కిలో వెండి ధర 64,800 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై లో64,800 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.69,100 ఉండగా, కోల్‌కతాలో రూ.64,800 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,100 ఉండగా, విజయవాడలో రూ.69,100 ఉంది.
కేరళలో కిలో వెండి ధర రూ.69,100 ఉండగా, మధురైలే రూ.69,100 వద్ద కొనసాగుతోంది.