Vivek Agnihotri : వాళ్ళు ఉన్నంత కాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది..

'ది కాశ్మీర్ ఫైల్స్'తో ఈ సినిమా డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రికి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. వివేక్ కూడా మొదటి నుంచి బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ మాఫియాని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు...............

Vivek Agnihotri : వాళ్ళు ఉన్నంత కాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది..

Vivek Agnihotri

Bollywood :  ఇటీవల బాలీవుడ్ లో స్టార్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అవ్వడం, అక్కడ బాలీవుడ్ మాఫియాకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ సినిమాలు హిట్ అవ్వడం, సౌత్ సినిమాలు డామినేట్ చేయడంతో బాలీవుడ్ పై, అక్కడి స్టార్ ఫ్యామిలీలు, హీరోలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించి పెద్ద హిట్ గా నిలిచింది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

The Warrior: ది వారియర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రామ్ అదరగొట్టాడుగా!

‘ది కాశ్మీర్ ఫైల్స్’తో ఈ సినిమా డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రికి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. వివేక్ కూడా మొదటి నుంచి బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ మాఫియాని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్‌ ఖాన్, సల్మాన్ ఖాన్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. BBC ఛానల్.. ఇప్పటికి షారుఖ్ ఎందుకు ఇంకా బాలీవుడ్ కి కింగ్ లా ఉన్నారు అని ఓ ట్వీట్ చేయగా, దానికి వివేక్ అగ్నిహోత్రి రిప్లై ట్వీట్ ఇస్తూ.. ”కింగ్స్‌, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్‌ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల కథలతో సినిమాలు తీస్తూ ప్రజల పరిశ్రమగా మార్చాలి. అది మాత్రమే ప్రపంచ సినిమా పరిశ్రమని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది” అని పోస్ట్ చేశారు. ఇండైరెక్ట్ గా వివేక్‌ అగ్నిహోత్రి ఈ ట్వీట్ లో షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ను విమర్శించారు. దీంతో ఈ ట్వీట్ బాలీవుడ్ లో వైరల్ గా మారింది.