The Warrior: ది వారియర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రామ్ అదరగొట్టాడుగా!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి....

The Warrior: ది వారియర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రామ్ అదరగొట్టాడుగా!

Ram Pothineni The Warrior First Day Collections

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రావడంతో, ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రామ్ రెండు విభిన్న గెటప్స్‌లో చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

The Warrior: ‘ది వారియర్’ ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

ముఖ్యంగా పోలీస్ పాత్రలో రామ్ ఎనర్జీకి ప్రేక్షకులు పట్టం కట్టారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రభావం సినిమా థియేటర్లపై పడి, ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తారా రారా అనే సందేహం అందరిలో నెలకొంది. దీంతో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ.. రామ్ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఉండటంతో, వర్షాలు కూడా ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకిగా మారలేదు. ఇక ఈ సినిమాకు తొలిరోజే డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు.

The Warrior: సెన్సార్ ముగించుకున్న ది వారియర్

కానీ.. ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లు వచ్చి పడ్డాయి. తొలిరోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.8.73 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. లింగుస్వామి డైరెక్షన్‌కు రామ్ యాక్షన్, కృతి శెట్టి అందాలు కలగలసి ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చేలా చేశాయి. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.96 కోట్లు
సీడెడ్ – 1.04 కోట్లు
వైజాగ్ – 1.02 కోట్లు
ఈస్ట్ – 0.51 కోట్లు
వెస్ట్ – 0.67 కోట్లు
కృష్ణా – 0.38 కోట్లు
గుంటూరు – 1.19 కోట్లు
నెల్లూరు – 0.67 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 7.42 కోట్లు
తమిళనాడు – 0.94 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.73 కోట్లు
ఓవర్సీస్ – 0.30 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 8.73 కోట్లు