జియాగూడ పోలింగ్‌ బూత్ లో ఓట్ల గల్లంతు.. ఓటర్లు తీవ్ర నిరసన

  • Published By: bheemraj ,Published On : December 1, 2020 / 12:33 PM IST
జియాగూడ పోలింగ్‌ బూత్ లో ఓట్ల గల్లంతు.. ఓటర్లు తీవ్ర నిరసన

Jiaguda polling booth Votes missing : హైదరాబాద్ జియాగూడ పోలింగ్‌ బూత్ 38లో ఓట్లు గల్లంతయ్యాయి. 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయి. ఆన్‌లైన్ ఓటర్ లిస్ట్‌లో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌లో పేర్లు లేవని ఓటర్లు అంటున్నారు. ఓటర్ స్లిప్‌లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్..సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. 9,101 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.



ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతిపోలింగ్ బూత్ లో శానిటైజర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్ లు కూడా ఓటు హక్కు వినియోగంచుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.