Walnut Oil : గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించే వాల్నట్ అయిల్..

జింక్ వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటుంది, ఇది నెత్తిమీద ముఖ్యమైన నూనెను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది మరియు చుండ్రును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

Walnut Oil : గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించే వాల్నట్ అయిల్..

Walnut Oil

Walnut Oil : మానవ మెదడును పోలి ఉండే ఆకృతిని కలిగి ఉంటాయి వాల్నట్ అక్రోట్లు.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండే వీటితో వాల్నట్ అయిల్ ను తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ఈ నూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి, ఈ నూనెను పురాతన కాలం నుంచి వివిధ రకాల ప్రయోజనాల నిమిత్తం వాడుతున్నారు. చర్మము ,జుట్టుతో సహా మన శరీర ఆరోగ్యమంతటికీ అద్భుతమైన ప్రయోజనాలను కలిగజేస్తుంది.

వాల్నట్ అక్రోట్లను మాదిరిగానే వాల్నట్ నూనెలో కూడా మంచి పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ల కలిగి ఉంటాయి, దీనిలో చాలావరకు ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఈ మంచి కొవ్వు కలిగిన అయిల్ ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని 10% తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. దీంతోపాటు జ్ఞాపకశక్తి , ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. వాల్నట్ నూనె లో ఉన్నా పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మరియు ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం తోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వచ్చే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వాల్నట్ నూనెతో చర్మానికి మసాజ్ చేయవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని చుక్కలను కలపడం ద్వారా తల మీద మసాజ్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలంటే వాల్నట్ నూనె వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి, వాల్‌నట్స్‌లో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది, వాల్నట్ నూనె తీసుకోవడం వలన రక్తపోటును నియంత్రించడంలో ఉంచి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మరోగాలైన సోరియాసిస్ మరియు తామర వంటి వాటికి చికిత్సలో సహాయపడుతుంది.

ఇందులో సుమారు 10.4 శాతం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. మిగిలిన కొవ్వు ఆమ్లాలతో పోలిస్తే ఒమేగా -3 శరీర కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుంది. వాల్నట్ నూనె కి వంట చేసేటప్పుడు వాడితే కూరకి చేదు రుచి వస్తుంది. కాబట్టి దీనిని నేరుగా వంటల్లో కాకుండా సలాడ్లలో ఆహారంలో తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన కాంతివంతమైన చర్మం కోసం వాల్నట్ అయిల్ బాగా ఉపకరిస్తుంది. వాతావరణంలో ఉండే కాలుష్య కారకాలు మరియు ఫ్రీ రాడికల్స్ కారణంగా, చర్మం వయస్సు ముందే ముడతలు పడటం ప్రారంభమవుతుంది. ముడతలు తగ్గించడానికి ఉపకరిస్తుంది. ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా చర్మం నుండి ముడుతలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. చర్మం తేమను నిలుపుకునేలా చేస్తుంది. పెరుగులో తేనె మరియు నాలుగు ఐదు చుక్కల వాల్నట్ నూనెలో వేసి మొహానికి రాసుకుని ఒక అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొహం కాంతివంతంగా కనిపిస్తుంది.

వాల్నట్ ఆయిల్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆరు రకాల బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది. వాల్నట్ ఆయిల్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉందని ఒక పరిశోధన కనుగొంది. ఇది ఇన్ఫెక్షన్ల వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వాల్నట్ ఆయిల్లో వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ నూనె మంచి యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంది,కావున ఇది వృద్ధాప్య ఛాయలతో బాగా పోరాడటానికి సహాయపడుతుంది.

వయస్సు మరియు పోషక లోపాలు పెరగడం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. వీటితో పాటు, కాలుష్యం, యు.వి కిరణాల వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి మరియు ఫ్రీ రాడికల్స్ ప్రభావం వంటి ఇతర కారణాలు జుట్టు రాలడానికి కారణమవుతాయి. ఇది ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాలను,ఒత్తిడిని తగ్గించడంలో సహాయం పడి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రచురించిన ఒక పరిశోధనలో, చుండ్రు మరియు దాని ఫలితంగా వచ్చే జుట్టు రాలడం సమస్య నుండి ఉపశమనానికి వాల్నట్ ఆయిల్ ఉపయోగపడుతుందని కనుగొన్నారు.

జింక్ వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటుంది, ఇది నెత్తిమీద ముఖ్యమైన నూనెను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది మరియు చుండ్రును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. తలస్నానం చేసే అరగంట ముందు వాల్నట్ నూనెను మరియు కొబ్బరి నూనె కలుపుకుని తలకు రాసుకుని తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. వాల్‌నట్‌లో ఉండే పోషకాలు జుట్టు పెరగడానికి సహాయపడతాయి. దీనిలోని ఇనుము రక్త ప్రవాహాన్ని మరియు ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది చుండ్రును తగ్గించడానికి జింక్ సహాయపడుతుంది..

కొంతమందికి వాల్ నట్స్ తినడం వల్ల ఎలర్జీ కలుగుతుంది. ఇలా ఎలర్జీ వచ్చిన వారు వాళ్ళ నూనెను కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. వాల్ నట్ నూనె పడనివారికి చర్మం పై దద్దుర్లు, పెదవులు వాపు, స్కిన్ రాష్, దురద, జలుబు, గొంతు మంట, కడుపు నొప్పి , తిమ్మిరి, మలవిసర్జన, వాంతులు వంటి దుష్ర్పభావాలు ఉంటాయి. అదే సందర్భంలో కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతులో వాపు, దీర్ఘకాలిక జలుబు, నిద్రలో ఇబ్బంది వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి.