Waltair Veerayya : పండక్కి వంద కోట్లు కలెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య.. బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి, రవితేజకి 100 కోట్ల సినిమాలు..
తాజాగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నేడు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లో 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే దాదాపు...............

Waltair Veerayya collects 108 crores gross collections in 3 days
Waltair Veerayya : చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, రవితేజ, క్యాథరిన్ ముఖ్య పాత్రల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజయి మంచి విజయం సాధించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని జనాల్లోకి వెళ్ళింది వాల్తేరు వీరయ్య. చిరంజీవి, రవితేజ ఇద్దరూ కలిసి తమ మాస్, ఎమోషన్, కామెడీ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని బాగా అలరించారు. ఇక ఒకప్పటి వింటేజ్ చిరంజీవి లుక్ కనపడటంతో ప్రేక్షకులు మరింత బాగా సినిమాకి కనెక్ట్ అయ్యారు.
సంక్రాంతి పండగ కావడంతో అభిమానులతో పాటు, ఫ్యామిలీలు కూడా సినిమాలకి తరలి వచ్చారు. దీంతో సినిమాకి కలెక్షన్ల వరద పారుతుంది. మొదటి రోజే వాల్తేర్ వీరయ్య సినిమా దాదాపు 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. తాజాగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నేడు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లో 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే దాదాపు 60 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పట్లో సినిమాలు రిలీజ్ కి ఏమి లేకపోవడంతో, మరో రెండు రోజులు పండగా మూడ్ ఉండటంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 25 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి.
RGV : జనసేనలోనూ నా అభిమానులున్నారు.. పవన్ అభిమానిగానే మాట్లాడుతున్నా..
వాల్తేరు వీరయ్య సినిమా 100 కోట్లు సాధించడంతో చిరంజీవి, రవితేజ బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలు సాధించారు. చిరంజీవి గత సినిమా గాడ్ ఫాదర్ కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రవితేజ ఇటీవలే ధమాకా సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నారు. దీంతో ఈ హీరోలతో పాటు నిర్మాతలు, అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే నిర్మాతలు పండక్కి రిలీజ్ చేసిన ఇంకో సినిమా వీరసింహ రెడ్డి కూడా 100 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
#WaltairVeerayya takes over the Box Office like BOSS ??
108 Crores Gross in 3 days for MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya ??
MEGA⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/n8PszOFt5u
— Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023