Waltair Veerayya: వీరయ్య టైటిల్ సాంగ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరయ్య టైటిల్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈ టైటిల్ సాంగ్ వారి అంచనాలను మరింతగా పెంచేసింది. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ ఈ పాటను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

Waltair Veerayya: వీరయ్య టైటిల్ సాంగ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

Waltair Veerayya Title Song Explodes With DSP Music

Updated On : December 26, 2022 / 8:46 PM IST

Waltair Veerayya: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరయ్య టైటిల్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈ టైటిల్ సాంగ్ వారి అంచనాలను మరింతగా పెంచేసింది. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ ఈ పాటను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

Waltair Veerayya: టైటిల్ సాంగ్‌తో దిగుతున్న వీరయ్య.. పూనకాలతో ఫ్యాన్స్ రెచ్చిపోడం ఖాయం!

వీరయ్య పాత్రను ఎలివేట్ చేస్తూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ఈ పాటకే హైలైట్ అని చెప్పాలి. ఇక అనురాగ్ కుల్కర్ణి ఈ పాటను మరింత పవర్‌ఫుల్‌గా పాడాడు. వీరయ్య పాత్ర ఎలా ఉండబోతుందో, ఆయన చేసే విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో మనకు ఈ పాట వింటే అర్థమవుతోంది. ఈ పాటలో చిరంజీవి ఫెరోషియస్ లుక్‌లో కనిపించబోతున్నాడని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేసిన తీరు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.