Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

జీమెయిల్.. ఇప్పుడు ప్రతిఒక్కరికి మెయిల్ కామన్ అయిపోయింది. ఎక్కువగా జీమెయిల్స్ వాడేవారు ఎక్కువగా ఉంటారు. మీరు ఏ సైట్ యాక్సస్ కావాలన్నా జీమెయిల్ ఉండాల్సిందే.

Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

Want To Delete All Promotional, Social, And Junk Mails On Gmail At Once

Junk Mails On Gmail at Once : జీమెయిల్.. ఇప్పుడు ప్రతిఒక్కరికి మెయిల్ కామన్ అయిపోయింది. ఎక్కువగా జీమెయిల్స్ వాడేవారు ఎక్కువగా ఉంటారు. మీరు ఏ సైట్ యాక్సస్ కావాలన్నా జీమెయిల్ ఉండాల్సిందే. ఏ సోషల్ ప్లాట్ ఫాంలో అకౌంట్ ఓపెన్ చేసినా దాని కూడా మెయిల్ ఉండాల్సిందే. జీమెయిల్ అకౌంట్ అనేది ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ ఉంటే చాలు.. మీ కొత్త జీమెయిల్ రెడీ అయినట్టే. సాధారణంగా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే 15GB వరకు ప్రీస్పేస్ గూగుల్ అందిస్తోంది. ఒకవేళ ఈ మెయిల్ లో ఆ లిమిట్ దాటితే మాత్రం ప్రీమియం వెర్షన్ మెయిన్ అకౌంట్ తీసుకోవాల్సిందే. ఇంతవరకు బాగానే ఉంది. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయగానే మీకు గూగుల్ నుంచి వెల్ కమ్ అంటూ కొన్ని మెయిల్స్ వస్తాయి. ఆ తర్వాత నుంచి మీకు తెలియకుండానే అనేక ఈమెయిల్స్ వస్తుంటాయి. అందులో మీరు సబ్ స్ర్కిప్షన్ తీసుకుని మెయిల్స్ కూడా కనిపిస్తాయి.
Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

సాధారణంగా ఈ మెయిల్స్ ను స్పామ్స్ అంటారు. మీ మెయిల్ కు అవసరమైనవి కంటే అనవసరం లేని ఎన్నో జంక్ మెయిల్స్ వస్తుంటాయి. అయితే ఈ జంక్ మెయిల్స్ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక అలానే భరిస్తుంటారు యూజర్లు. అనవసరమైన మెయిల్స్ కారణంగా గూగుల్ మీకు ఇచ్చిన స్పేస్ నిండిపోతుంది. అప్పుడు మీ జీమెయిల్ యాక్సస్ చేసుకోలేరు. ఒకవేళ మీ జీమెయిల్ స్పేస్ నిండిపోతే.. ప్రీమియం స్టోరీజీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీ జీమెయిల్ లోని జంక్ మెయిల్స్ అన్ని ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. ప‌నికిమాలిన మెయిల్స్‌, ప్ర‌మోష‌న‌ల్, సోష‌ల్, జంక్, స్పామ్ మెయిల్స్‌తో నిండిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రీ స్టోరేజీ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అందుకే జీమెయిల్ అకౌంట్‌లో ఉన్న అవ‌స‌రం లేని మెయిల్స్‌ను డిలీట్ చేసుకుంటే కావాల్సినంత స్టోరేజ్ మళ్లీ పెరుగుతుంది.

అప్పుడు అప్‌గ్రేడ్ తో పని ఉండ‌దు. ఇంతకీ అవ‌స‌రం లేని మెయిల్స్‌ను చెక్ చేసుకోవాలి. జంక్ మెయిల్స్‌ను ఒక్కొక్క‌టి డిలీట్ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. Inbox by Google అనే అప్లికేష‌న్ ద్వారా ఈమెయిల్ అప్లికేష‌న్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అక్కడ మీకు అవ‌స‌రం లేని అన్ని జంక్ మెయిల్స్‌ను ఒకే ఒక్క క్లిక్‌తో డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ యాప్‌ను మీ ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. అందులో జీమెయిల్‌లోని మెయిల్స్ అన్నీ సింక్ అవుతాయి. మెయిల్స్ అన్నీ క్యాట‌గిరీల వారీగా స‌ప‌రేట్ అయిపోతాయి. సాధారణంగా జీమెయిల్‌లో ప్రియారిటీ, అప్‌డేట్స్‌, ప్ర‌మోష‌న్‌, అన్‌రీడ్‌, ఫోర‌మ్స్‌, ప‌ర్‌చేజెస్‌ కేటటగిరీలు ఉంటాయి. మీ మెయిల్స్‌లో అవ‌స‌రం లేని క్యాట‌గిరీలోని మెయిల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే Archives మార్చుకోవచ్చు. అప్పుడు మీ జీమెయిల్ లోని అవ‌స‌రం లేని మెయిల్స్ డిలీడ్ అయిపోతాయి. తద్వారా మీ జీమెయిల్ ప్రీ స్పేస్ క్లీన్ అవుతుంది.
Child Pornography : ఆ వీడియోలు చూస్తున్నారా..అయితే..జైలుకే