Water melon : ఈ కాయను తింటే హైబీపితోపాటు అధిక బరువు తగ్గొచ్చు..

క్షారగుణం కలిగి ఉండటంతో శరీరంలో ఉన్న వ్యర్ధపదార్ధాలను తగ్గిస్తుంది. కాల్షియం కలిగి ఉండటంతో కీళ్ళనొప్పులు, వాతసంబంధింత రోగాలను నియంత్రణలో ఉంచుతుంది.

Water melon : ఈ కాయను తింటే హైబీపితోపాటు అధిక బరువు తగ్గొచ్చు..

Water Melon

Water melon : పుచ్చకాయ…నీటి శాతం ఎక్కువగా కలిగి ఉండి, ఎర్రటి వర్ణంలో తియ్యని రుచికరమైన ఈ కాయను తినేందుకు అంతా ఇష్టపడుతుంటారు. గతంలో వేసవి సీజన్ లో మాత్రమే దొరికే ఈ పండు ప్రస్తుతం అన్ని సీజన్లలో దొరుకొతుంది. 5వేల సంవత్సరాల క్రితమే ఈ జిప్టులో ఈ పుచ్చకాయను పండించినట్లు చరిత్ర చెబుతుంది. పుచ్చకాయను తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, ఫాస్పరస్, విటమిన్ సి, పీచుపదార్దాలను కలిగి ఉంటుంది.

క్షారగుణం కలిగి ఉండటంతో శరీరంలో ఉన్న వ్యర్ధపదార్ధాలను తగ్గిస్తుంది. కాల్షియం కలిగి ఉండటంతో కీళ్ళనొప్పులు, వాతసంబంధింత రోగాలను నియంత్రణలో ఉంచుతుంది. మూత్రంలో యూరిక్ ఆమ్లాన్నీ నియంత్రించటంతోపాటు గుండె ఆరోగ్యానికి పుచ్చకాయ ఎంతగానో మేలు కలిగిస్తుంది. హైబీపి రక్తపోటుతో బాధపడుతున్న వారు పుచ్చకాయను తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలు ఇందుకు చక్కగా ఉపయోగపడతాయి.

పుచ్చకాల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. హైబీపిని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే పొటాషియం హైబీపిని నియంత్రించటంలో తోడ్పతున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రతిరోజు పుచ్చకాయను ఆహారంగా తీసుకోవటం వల్ల హైబీపిని తగ్గించుకోవచ్చు.

ఇందులో ఉండే ఎల్ సిట్రులైన్, లైకోపీన్, పోటాషియం లు అధిక బరువును తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఎల్ సిట్రులైన్ శరీరంలో నైట్రిక్ అక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. రక్త నాళాలను సులభంగా సంకోచ, వ్యాకోచాలు చెందేలా చేస్తుంది. నీటి పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్ధ మెరుగుపడటంతోపాటు, మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్న వారు పుచ్చకాయను పరిమితంగానే తీసుకోవాలి.