Weather AP : మూడు రోజులు వర్షాలు..ఎక్కడెక్కడంటే

ఏపీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

Weather AP : మూడు రోజులు వర్షాలు..ఎక్కడెక్కడంటే

Aprain

Heavy Rain Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, 2021, సెప్టెంబర్ 24వ తేదీ శుక్రవారం రాత్రికి వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడనుందని, 48 గంటల్లో పశ్చిమ – వాయువ్య దిశగా…ఒడిశా తీరం వైపు పయనించనుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.

Read More : Shriya Sharma : చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియ శర్మ.. ఇప్పుడెలా ఉందో చూశారా..!

దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ – ఒడిశా – ఏపీ తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా..సోమవారం మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read More : Telangana : కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే
శనివారం :
కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, గుంటూరు, రాయలసీమ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆదివారం :
ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గుంటూరు, కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

Read More : Ram Gopal Varma : వరంగల్‌లో వర్మ సీక్రెట్ సెర్చింగ్.. వాళ్ల బయోపిక్ గురించేనా..?

సోమవారం : ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.