Warangal : ఘనంగా కూతురి పెళ్లి చేసిన తండ్రి.. అంతలోనే విషాదం

ఆ తండ్రి అమితానందం పొందాడు. కానీ..అంతలోనే విషాదం చోటు చేసుకుంది. భాజా భజంత్రిలు ఆగిపోయి.. రోదనలతో ఆ పెళ్లి మంటపం మారుమ్రోగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో...

Warangal : ఘనంగా కూతురి పెళ్లి చేసిన తండ్రి.. అంతలోనే విషాదం

Wedding

Wedding tragedy In Warangal : కూతురి పెళ్లి ఘనంగ చేయాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. అలాగే ఓ తండ్రి కలలు కన్నాడు. అల్లారుముద్దుగా పెంచి.. పెద్ద చేసి చదువు చెప్పించడంతో పాటు.. ఆమెకు తగిన వరుడిని వెతికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడా ఆ తండ్రి. తాను కష్టపడ్డా.. కన్నబిడ్డకు ఘనంగా పెళ్లి చేశాడు. తాహతుకు మించి.. కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించాడు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పెళ్లి మండపం కళకళలాడింది. భాజాభజంత్రిల నడుమ పెళ్లి కొడుకు కూతురి మెడలో తాళి కడుతుంటే.. ఆ తండ్రి అమితానందం పొందాడు. కానీ..అంతలోనే విషాదం చోటు చేసుకుంది. భాజా భజంత్రిలు ఆగిపోయి.. రోదనలతో ఆ పెళ్లి మంటపం మారుమ్రోగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

Read More : Prashant Kishor : ప్రగతి భవన్‌‌లో పీకే.. టెన్షన్‌‌లో టి. కాంగ్రెస్

పెళ్లింట్లో ఊహించని విషాదం అలుముకుంది..కన్నుల పండువగా కన్నబిడ్డ పెళ్లి చేసిన ఓ తండ్రి అదే పెళ్లి వేడుకలో కన్ను మూశాడు. ఆ తండ్రి మరణంతో పెళ్లింట రోధనలు మిన్నంటాయి. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వధువు తండ్రి తన కూతురికి అల్లుడు అరుంధతి నక్షత్రం చూపెట్టే లోపే తనువు చాలించాడు. అదే పెళ్లి వేడుకలో గుండెపోటుతో మృతి చెందాడు. వరంగల్ జిల్లాలోని వేణురావుకాలనీ కి చెందిన బొరిగం వెంకట్రాంనర్సయ్య కాశిబుగ్గలోని కల్యాణ మండపంలో తన కూతురు హారిక పెళ్లి వేడుక నిర్వహించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపాడు.

Read More : Warangal : వరంగల్‌లో దారి దోపిడి-వ్యాపారి నుంచి రూ.7లక్షలు అపహరణ

కూతురు పెళ్లి అయ్యాక కొద్ది నిమిషాల వ్యవధిలోనే తనువు చాలించాడు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం అతిథులంతా వధూవరులను ఆశీర్వదిస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. బంధుమిత్రులతో సందడిగా ఉన్న కల్యాణమండపంలో అంతలోనే భోరున విలపిస్తు రోధనలు మిన్నంటాయి. వధువు తండ్రి వెంకట్రాంనర్సయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. దీంతో బంధుమిత్రులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. బాజాభజంత్రీలు మూగబోయాయి. వధువు ఇంట్లో చావు డప్పులు మోగాయి. ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.