Prashant Kishor : ప్రగతి భవన్‌‌లో పీకే.. టెన్షన్‌‌లో టి. కాంగ్రెస్

కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వచ్చిన వెంటనే టీఆర్‌ఎస్‌తో కటీఫ్‌ చెబుతారు అనుకుంటున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ హైద‌రాబాద్ వ‌చ్చి కేసీఆర్ తో స‌మావేశం కావటం.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు షాక్ ఇచ్చినట్టు అయింది...

Prashant Kishor : ప్రగతి భవన్‌‌లో పీకే.. టెన్షన్‌‌లో టి. కాంగ్రెస్

Pk pragathi Bhavan

Prashant Kishor And T. Congress : రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని దేశమంతా ప్రచారం జరుగుతున్న సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ అకస్మాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రితో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. రాత్రి ప్రగతిభవన్‌లోనే బసచేసిన పీకే.. ఆదివారం కూడా కేసీఆర్‌తో చర్చలు కొనసాగించనున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో పీకే హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రశాంత్‌ కిశోర్‌ ప్రగతిభవన్‌ మీటింగ్స్‌ గాంధీభవన్‌లో కలకలం రేపాయి. ఇంకా పార్టీలో చేరలేదు కాబట్టి పీకేను ఏమీ అనలేరు.. అలాగని రేపో, మాపో పార్టీలో చేరిన తర్వాత ఆయన ప్లాన్స్‌ను నమ్మనూలేరు. కాంగ్రెస్‌ హై కమాండ్‌ జాతీయ ప్రయోజనాల కోణంలో దీన్ని పట్టించుకోదనే అభిప్రాయమూ ఉంది. అయితే పోరాడితే గెలుస్తామ‌నే ఆశ‌లు ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పీకేలాంటి వారి వ‌ల్ల లాభం కంటే న‌ష్టమే ఎక్కువ జ‌రుగుతుంద‌ని టీపీసీసీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Read More : Sonia – Prasanth kishore: మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన సోనియా – ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వచ్చిన వెంటనే టీఆర్‌ఎస్‌తో కటీఫ్‌ చెబుతారు అనుకుంటున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ హైద‌రాబాద్ వ‌చ్చి కేసీఆర్ తో స‌మావేశం కావటం.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు షాక్ ఇచ్చినట్టు అయింది. పీకే విష‌యంలో జ‌రుగుతున్న చ‌ర్చ ఆయ‌న టీఆర్ఎస్ అగ్రనేత‌ల‌తో భేటీ అవ‌టం తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌ను, శ్రేణుల‌ను మ‌రంత గంద‌ర‌గోళంలోకి నెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటోంది.. రాహుల్‌ పర్యటనతో మరింత జోష్‌ నిండుతుందని అనుకుంటున్న సమయంలో పీకే మీటింగ్‌ చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యవహారంలో టీపీసీసీ మొదటి నుంచి విముఖంగానే ఉంది. టీఆర్‌ఎస్‌కు వ్యూహాలు అందిస్తున్నారన్న వార్తలు వచ్చినప్పుడు.. గాంధీభవన్‌ అంతా పీకేపై సెటైర్లు వేసింది.

Read More : Prashant Kishor : ప్రశాంత్ కిషోర్‌‌తో టీఆర్ఎస్ కటీఫ్ ?

కాంగ్రెస్‌కు స్ట్రాటజిస్టులే అవసరం లేదు.. కార్యకర్తలు చాలంటూ కామెంట్స్‌ కూడా చేశారు కాంగ్రెస్ పెద్దలు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ప్రశాంత్‌ కిశోర్‌తో చర్చలు జరపటం తెలంగాణ హస్తం నేతలకు షాక్‌గా మారింది. అప్పటికే గందరగోళంలో పడిన కాంగ్రెస్‌ నేతలు.. సరేలే అని సైలెంట్‌ అయ్యారు. హైకమాండ్‌ చూసుకుంటుంది లే అని ఊరుకున్నారు. టీఆర్‌ఎస్‌ లెక్కలన్నీ తెలుసుకున్నాడు.. ఇప్పుడు తమ పార్టీలోనే చేరుతున్నాడు కదా అని సంబురపడ్డారు. కానీ ఒక్కరోజులోనే మొత్తం సీన్‌ రివర్స్‌ అయింది. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో టచ్‌లో ఉంటూనే.. గులాబీబాస్‌తో మంతనాలు మొదలుపెట్టారు ప్రశాంత్‌ కిశోర్‌. ఏకంగా ప్రగతిభవన్‌లోనే బస చేసి.. కాంగ్రెస్ నేతలకు షాక్‌ ఇచ్చారు. ఇప్పుడు వారు ఏం మాట్లాడాలో.. ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు.