Prashant Kishor : ప్రశాంత్ కిషోర్‌‌తో టీఆర్ఎస్ కటీఫ్ ?

ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్‌ఎస్ తెగతెంపులు చేసుకుంటోందా..? కాంగ్రెస్ నేత సలహాలు, సూచనలు టీఆర్‌ఎస్‌కు అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా...?..

Prashant Kishor : ప్రశాంత్ కిషోర్‌‌తో టీఆర్ఎస్ కటీఫ్ ?

Pk

Prashant Kishor And TRS : ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అప్పుడే పార్టీలు రెడీ అయిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ తో టీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే పీకే టీం.. రాష్ట్రంలో సర్వే కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే.. అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ వైపు చూస్తుండడం.. ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతుండడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన్ను పక్కన పెట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : Telangana : ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే..మా పరిస్థితి ఏంటీ అంటూ టీ.కాంగ్రెస్ నేతల డైలమా..ఎందుకంటే..?

ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్‌ఎస్ తెగతెంపులు చేసుకుంటోందా..? కాంగ్రెస్ నేత సలహాలు, సూచనలు టీఆర్‌ఎస్‌కు అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా…? ప్రశాంత్‌ రాజకీయ వ్యూహాలతో మరోసారి అధికారంలోకి రావాలనుకున్న టీఆర్‌ఎస్‌..ఇప్పుడు..ఆయన్నే రాజకీయ ప్రత్యర్థిగా చూస్తోందా..? తాజా పరిణామాలు చూస్తోంటే అవుననే అనిపిస్తోంది. వ్యూహకర్తగా విశేష గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్…కాంగ్రెస్‌ నేతగా మారేందుకు రంగం సిద్ధమైన వేళ…టీఆర్‌ఎస్..ఆయనకు దూరం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సొంత వ్యూహం ఉపయోగించి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉండే కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

Read More : PK STrategy In congress: పార్టీ మీది..స్ట్రాటజీ నాది అంటున్న PK..అందుకే కాంగ్రెస్ కు అండగా ఉంటున్నానంటున్న రాజకీయ చాణుక్యుడు

కీలక పాత్ర పోషించిన పీకే :-
ఇప్పటిదాకా అనేక ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి ఆయా రాష్ట్రాలో అవి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన పీకే…కొన్నిరోజుల క్రితం టీఆర్‌ఎస్‌కు రాజకీయ సలహాదారుగా మారారు. ప్రశాంత్ కిషోర్ గురించి సీఎం కేసీఆర్ బహిరంగంగానే మాట్లాడారు. ఆయన టీఆర్‌ఎస్‌కు ఉచితంగానే సేవలందిస్తున్నారనీ చెప్పారు. అసలు పీకే ఉంటే హుజూరాబాద్ ఫలితం మరోలా ఉండేదన్నారు. అంతలా పీకేపై విశ్వాసం ఉంచారు కేసీఆర్. అంతే కాదు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలన్నింటి వెనకా..ప్రశాంత్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. తృతీయ కూటమి ఏర్పాటు లాంఛనప్రాయమే అన్న పరిస్థితి కనిపించింది. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ ఘనవిజయం, కాంగ్రెస్ ఘోర ఓటమి జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చాయి.

Read More : కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్ కిశోర్..?

కొత్త సమీకరణాలు :-
పార్టీ ప్రక్షాళన కోసం కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ వైపు చూడడం, రాజకీయ వ్యూహకర్తగా కన్నా..కాంగ్రెస్ నేతగా కనిపించేందుకు పీకే ఆరాటపడడంతో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ వైపు పీకే వేస్తున్న అడుగులు గులాబీపార్టీని పునరాలోచనలో పడేశాయి. పీకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరుక్షణం ఆయనకు దూరం జరగాలన్న ఆలోచనలో టీఆర్‌ఎస్ ఉంది. తమ పార్టీకి ఓ రాజకీయ వ్యూహకర్త, ఆయన బృందం ఇచ్చే సలహాలు, సూచనలు కావాలి కానీ… ఇతర పార్టీ నేత సమాలోచనలతో పనిలేదని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Read More : Telangana : తెలంగాణలో ప్రశాంత్ కిశోర్.. పీకే టీం సర్వే

కాంగ్రెస్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ :-
ప్రశాంత్ కిషోర్ రాష్ట్రాల్లో పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో తెలంగాణకు సంబంధించి కీలక సూచన చేసినట్టు భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ అంటే రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉందని, ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవాలంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పీకే పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ నెల మొదటివారంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌తో కానీ, ఎంఐఎంతో కానీ పొత్తుపెట్టుకోదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు గమనిస్తే…టీఆర్ఎస్‌, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా తలపడే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రశాంత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరుక్షణం..ఆయనతో టీఆర్ఎస్‌ బంధానికి ఫుల్‌స్టాప్ పడనుంది. అటు కాంగ్రెస్ కూడా పీకేను పార్టీలో చేర్చుకోవాలంటే..ఇతర పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం ఆపివేయాలన్న షరతు విధించినట్టు హస్తం నేతలు అంటున్నారు. అందుకు పీకే ఒప్పుకుంటే…ఇక ఆయన వ్యూహకర్త నుంచి ఫుల్‌టైం పొలిటీషియన్‌గా మారిపోతారు.