Wrestlers Protest: జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే న్యాయం దొరకదట.. రెజ్లర్ల నిరసనపై విరుచుకుపడ్డ బ్రిజ్ భూషణ్

"హర్యానాలోని 90% మంది అథ్లెట్లు, సంరక్షకులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను విశ్వసిస్తున్నారని, తనపై ఆరోపణలు చేసే కొన్ని కుటుంబాలు ఒకే 'అఖాడా'కి చెందినవారని అన్నారు. ఆ 'అఖాడా' పోషకుడు దీపేందర్ హుడా అంటూ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.

Wrestlers Protest: జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే న్యాయం దొరకదట.. రెజ్లర్ల నిరసనపై విరుచుకుపడ్డ బ్రిజ్ భూషణ్

Brij Bhushan Sharan Singh

Updated On : April 30, 2023 / 5:31 PM IST

Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన చేస్తున్న రెజ్లర్లపై విరుచుకుపడ్డారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినంత మాత్రాన న్యాయం దొరకదని ఆయన అన్నారు. ఏడుగురు మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన రెండు రోజుల అనంతరం ఆయన ఈ విధంగా స్పందించారు. మొదటి ఎఫ్‌ఐఆర్ మైనర్ రెజ్లర్ ఆరోపణలకు సంబంధించినది, పోక్సో చట్టం కింద నమోదు చేశారు. ఇక రెండవది విపరీతమైన ప్రవర్తనకు సంబంధించినది.

Karnataka Polls: ఖర్గే చేసిన ‘విష సర్పం’ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ

తనపై ఆరోపణలు చేసిన వారు కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా అనే అఖాడాకు చెందిన వారని బ్రిజ్ భూషణ్ సింగ్ ఆరోపించారు. “హర్యానాలోని 90% మంది అథ్లెట్లు, సంరక్షకులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను విశ్వసిస్తున్నారని, తనపై ఆరోపణలు చేసే కొన్ని కుటుంబాలు ఒకే ‘అఖాడా’కి చెందినవారని అన్నారు. ఆ ‘అఖాడా’ పోషకుడు దీపేందర్ హుడా అంటూ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.

Wrestlers vs WFI: లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆ ఏడుగురు మహిళా రెజ్లర్లకు పోలీసుల భద్రత

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులను ఎగతాళి చేస్తూ “మీకు జంతర్ మంతర్ నుంచి న్యాయం జరగదు. న్యాయం కావాలంటే పోలీసులు, కోర్టుకు వెళ్లాలి. వారు ఇప్పటివరకు అలా చేయలేదు. కోర్టు ఏది తీర్పు ఇచ్చినా నేను అంగీకరిస్తాను’’ అని అన్నారు. దీనికి ముందు ఆయన స్పందిస్తూ తాను ఏ రకమైన విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే తన పదవికి రాజీనామా చేయనని తేల్చి చెప్పారు.