Prithviraj Sukumaran : హీరోగా, డైరెక్టర్‌గా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న మలయాళం స్టార్ హీరో.. టాలీవుడ్‌కి ఇతనే దిక్కు అవుతున్నాడు..

పృథ్విరాజ్ సుకుమారన్.. ఇప్పుడు ఈ పేరు తెలుగులో కూడా ఫుల్ పాపులర్ అవుతోంది. ఆయన నటించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మలయాళ సినిమాను...................

Prithviraj Sukumaran : హీరోగా, డైరెక్టర్‌గా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న మలయాళం స్టార్ హీరో.. టాలీవుడ్‌కి ఇతనే దిక్కు అవుతున్నాడు..

Prithviraj

Prithviraj Sukumaran :  కొంతమంది మట్టిని ముట్టుకున్నా బంగారమవుతుంది. దానికి మళయాల స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆయన హీరోగా చేసినా, డైరెక్టర్ గా చేసినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతోంది. రీమేక్ చేసినా అది సక్సెసే అవుతుంది. దాంతో పృథ్విరాజ్ సుకుమారన్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు? అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో హాట్ హాట్ గా నడుస్తోంది.

పృథ్విరాజ్ సుకుమారన్.. ఇప్పుడు ఈ పేరు తెలుగులో కూడా ఫుల్ పాపులర్ అవుతోంది. ఆయన నటించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మలయాళ సినిమాను భీమ్లానాయక్ గా పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే, ఆయన డైరెక్షన్ లో వచ్చిన లూసీఫర్ సినిమాను మెగాస్టర్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. లూసీఫర్ లాంటి పొలిటికల్ థ్రిల్లర్ తర్వాత కామెడి జోనర్ లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రీ కొడుకులుగా బ్రోడాడిని తెరకెక్కించి సక్సెస్ కొట్టాడు. ఆ సినిమాను వెంకటేశ్, రానా కాంబినేషన్ లో సురేష్ బాబు తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పృద్విరాజ్ చేసిన మరో సినిమా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తెలుగులో రీమేక్ అవ్వబోతుంది.

పృథ్విరాజ్ నటుడు, దర్శకుడే కాదు. గాయకుడు, నిర్మాత కూడా. సహజత్వానికి దగ్గరగా, కథాబలం ఉన్న సినిమాలతో సక్సెస్ సాధించడంలో ముందుంటున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో అంచనాలు సహజంగానే పెరిగిపోతున్నాయి. అంచనాలు రీచ్ అవుతూ సినిమా సినిమాకీ వేరియేషన్ చూపిస్తూ సక్సెస్ అవతున్నాడు పృథ్విరాజ్. ఏప్రిల్ లో రిలీజ్ అయిన జనగణమన సినిమా రీసెంట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ లో కొచ్చింది. గత రెండు మూడు రోజుల నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతలా ఆకట్టుకున్న ఈ సినిమా సోషల్ వ్యవస్థపై ప్రశ్నలు సందించింది. మరి ఈ సినిమాను తెలుగులో ఏ హీరో రీమేక్ చేస్తాడో అనే చర్చ ఓ వైపు నడుస్తోంది.

 

Special Characters : పెరుగుతున్న స్పెషల్ క్యారెక్టర్స్.. ఆసక్తి చూపిస్తున్న స్టార్ హీరోలు..

ఇలా వరుస సినిమాలతో వివిధ జోనర్స్ తో మలయాళంలో హిట్స్ కొడుతున్నాడు పృద్విరాజ్. పృద్విరాజ్ తీసిన సినిమాలన్నీ ఒక్కొక్కటీ తెలుగులో రీమేక్ అవుతున్నాయి. దీంతో తెలుగు వాళ్ళు పృద్విరాజ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడా అని ఎదురు చూస్తున్నారు. అంతేకాక పృద్విరాజ్ సలార్ సినిమాలో ప్రభాస్ పక్కన ఓ స్పెషల్ క్యారెక్టర్ కూడా చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరవ్వనున్నాడు.