Heart Health : గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

పాలీష్ పట్టిన ధాన్యం, ఘన రూపంలో ఉండే కొవ్వులు, చక్కెర, మాసం, వంటి నిత్య ఆహారపు అలవాట్లు కలిగిన వారిలో శాస్వసకోశ సమస్యలతోపాటు,

Heart Health : గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

Heart (1)

Heart Health : మనిషికి ఉండే అవయవాల్లో గుండె చాలా ముఖ్యమైనది. రక్తాన్ని పంపిణీ చేసే కీలకమైన వ్యవస్ధ గుండె. నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ముఖ్యమైన గుండె అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలం జీవించాలంటే గుండె ఆరోగ్యం విషయంలో మంచి ఆహారపు అలవాట్లను తూచా తప్పకుండా పాటించాలి.

పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, పాల ఉత్పత్తులతో కూడిన పోషకాహారాలను ప్రతిరోజు నిర్ధిష్ట సమయాల్లో తీసుకోవటం ద్వారా గుండె ఎలాంటి రుగ్మతల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా బోజనం తరువాత అరటి, బంగాళ దుంప వంటి చిప్స్ ను తినకపోవటమే ఉత్తమం. ఇలాంటివాటిని తినటం వల్ల ప్రాణాలు కోల్పోయే వారు 50శాతం కాగా, గెండు సంబంధిత జబ్బులతో 45శాతం మంది బాధపడుతున్నట్లు ఓ అధ్యయనం లో తేలింది. ఇదే విషయం అమెరికన్ హార్ట్ అసోసియన్ జర్నల్ లో ప్రచురితమైంది.

పాలీష్ పట్టిన ధాన్యం, ఘన రూపంలో ఉండే కొవ్వులు, చక్కెర, మాసం, వంటి నిత్య ఆహారపు అలవాట్లు కలిగిన వారిలో శాస్వసకోశ సమస్యలతోపాటు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు 44 శాతం ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్న బోజనంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పెరుగు,నట్స్ తీసుకునేవారిలో మరణాలు 34శాతం తక్కువ. రాత్రి బోజనంలో కూరగాయలు, పప్పుదినుసులు తీసుకునేవారు గుండెజబ్బులతో చనిపోవటం 23శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందట.

ఇక మనం తినే ఆహారం ఏయే సమయాల్లో తీసుకుంటున్నామన్నది చాలా ముఖ్యం. జీవ గడియారాన్ని తప్పకుండా అనుసరిస్తూ ఆహారం తీసుకుంటే గుండె పదిలంగా పదికాలాలపాటు పనిచేస్తుంది. ఉదయం టిఫెన్ తర్వాత పండ్లు తీసుకోవటం, మధ్యాహ్నం బోజనం లో మాసం, చక్కెర, పాలీష్ పట్టిన ధాన్యం వంటి వాటిని తీసుకోకుండా ఉండటం ఉత్తమం. వాటికి బదులుగా తృణ ధాన్యాలు, పాలిష్ పట్టకుండా ఉండే ముడిబియ్యం, వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి.

సాయంత్రం సమయంలో వాల్ నట్స్, కప్పు పెరుగు, బెర్రీలు వంటి వాటిని స్నాక్స్ లో భాగం చేసుకోవాలి. రాత్రి సమయంలో భోజనం లో భాగంగా కూరగాయలు, పప్పు దినుసులతో చేసిన పదార్ధాలను తీసుకుంటే మంచిది. గుండె ఆరోగ్యం కోసం తీసుకునే ఆహారంపై తగినంత శ్రద్ధ కనబరిస్తే ఎక్కవ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది.