WhatsApp Offline : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా.. ఇలా ఈజీగా వాట్సాప్ మెసేజ్‌లు పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
WhatsApp Offline : వాట్సాప్ (WhatsApp) తమ ఆండ్రాయిడ్ (Android), iOS యూజర్ల డెస్క్‌టాప్ డివైజ్‌ల కోసం ప్రాక్సీ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ అంతరాయం కలిగినా లేదా బ్లాక్ అయినా కూడా మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

WhatsApp Offline _ How to send WhatsApp messages without the internet
WhatsApp Offline : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ ఆండ్రాయిడ్ (Android), iOS యూజర్ల డెస్క్‌టాప్ డివైజ్‌ల కోసం ప్రాక్సీ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ అంతరాయం కలిగినా లేదా బ్లాక్ అయినా కూడా మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. WhatsApp ప్రాక్సీ కనెక్షన్‌తో, ప్రభుత్వ సెన్సార్‌షిప్ కారణంగా ఇంటర్నెట్ లిమిట్ చేసినా కూడా వినియోగదారులు సులభంగా ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ చేయవచ్చు.
మీరు మీ ప్రాంతంలో ఇంటర్నెట్ అంతరాయాన్ని కూడా ఎదుర్కొంటున్నట్లయితే.. WhatsAppని ప్రాక్సీ సర్వర్‌ల ద్వారా ప్రయత్నించవచ్చు. ఈ ప్రాక్సీ సర్వర్‌లను వినియోగదారులు సురక్షితంగా, స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేయడంలో సాయపడుతుంది. ఈ సర్వర్లు స్వచ్ఛంద సేవకులు, సంస్థలచే సెటప్ చేసినట్టు నివేదిక తెలిపింది.
వాట్సాప్ ప్రాక్సీ సర్వర్‌లను ఎలా గుర్తించాలి? :
మీరు తరచుగా ఇంటర్నెట్ సమస్యలను ఎదుర్కొంటే.. విశ్వసనీయ సోషల్ మీడియా లేదా సెర్చ్ ఇంజిన్‌ల ద్వారా మల్టీ ప్రాక్సీ సర్వర్ అడ్రసులను కనుగొనవచ్చు. అలాగే మీ డివైజ్‌లో సేవ్ చేయవచ్చు. వాలంటీర్లు తరచుగా ప్రాక్సీ సర్వర్‌లను క్రియేట్ చేస్తుంటారు. ఇతరుల కోసం వాటిని ఆన్‌లైన్‌లో షేర్ చేస్తారు. మీరు మల్టీ ప్రాక్సీ సర్వర్ అడ్రస్‌లను సేవ్ చేయాలి. కొంత సమయం తర్వాత చాలా ప్రాక్సీ సర్వర్లు బ్లాక్ అవుతాయి. అందుకే మీరు ఒక నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయలేకపోతే.. మీరు వేరే ప్రాక్సీ సర్వర్‌ని ఎంటర్ చేసి కనెక్ట్ చేయవచ్చు.
Androidలో WhatsApp ప్రాక్సీకి ఎలా కనెక్ట్ చేయాలంటే? :
* WhatsApp లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేయండి లేదా Download చేయండి.
* Whatsapp> Chats Tab> Settings> Storage Data > Proxyని ఓపెన్ చేయండి.
* ఇప్పుడు use proxy ఆప్షన్ ట్యాప్ చేయండి. మీరు కనెక్ట్ చేసే ప్రాక్సీ అడ్రస్‌లను ఎంటర్ చేయండి.
* Saveపై Tap చేయండి.
* కనెక్షన్ సక్సెస్ అయిన తర్వాత WhatsApp చెక్‌మార్క్‌ను చూపిస్తుంది.

WhatsApp Offline _ How to send WhatsApp messages without the internet
ఐఫోన్‌లో WhatsApp ప్రాక్సీకి ఎలా కనెక్ట్ చేయాలంటే? :
* WhatsApp Settings> Storage and Data > Proxy ఓపెన్ చేయండి.
* Use Proxy ఆప్షన్ Tap చేయండి.
* Proxy Address ఎంటర్ చేసి, కనెక్ట్ చేసేందుకు Save ఆప్షన్ Tap చేయండి.
WhatsApp ప్రాక్సీ సర్వర్‌లను ఎలా క్రియేట్ చేయాలంటే? :
మీరు కూడా ప్రాక్సీ సర్వర్‌ని క్రియేట్ చేసి అవసరమైన యూజర్లకు సాయపడవచ్చు. 80, 443 లేదా 5222 అందుబాటులో ఉన్న పోర్ట్‌లు, సర్వర్ IP అడ్రస్ సూచించే డొమైన్ పేరు (లేదా సబ్‌డొమైన్) ఉన్న సర్వర్‌ని ఉపయోగించి మీరు ప్రాక్సీని సెటప్ చేయవచ్చు. వివరణాత్మక డాక్యుమెంటేషన్, సోర్స్ కోడ్ GitHubలో అందుబాటులో ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌కు నేరుగా కనెక్ట్ చేయలేని యూజర్లతో ఈ ప్రాక్సీ అడ్రస్‌లను ప్రైవేట్‌గా షేర్ చేయాలని WhatsApp యూజర్లను కోరుతోంది.
ముఖ్యంగా, ప్రాక్సీ కనెక్షన్ ద్వారా WhatsAppను సెక్యూరిటీ, ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వినియోగదారులు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్, కాల్‌లు, వీడియో కాల్‌లతో సేఫ్ కనెక్షన్‌ని ఏర్పాటు చేయవచ్చు. మొత్తం డేటా యూజర్లు కమ్యూనికేట్ చేస్తున్న యూజర్ల మధ్య ఉంటుంది. WhatsApp, Meta లేదా ప్రాక్సీ సర్వర్‌లలో కనిపించదు. మీరు థర్డ్-పార్టీ ప్రాక్సీని ఉపయోగించడం వల్ల మీ IP అడ్రస్ ప్రాక్సీ ప్రొవైడర్‌తో షేర్ చేయవచ్చని గుర్తుంచుకోండి. థర్డ్-పార్టీ ప్రాక్సీలు WhatsApp ద్వారా పొందలేమని గమనించాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..