MS Dhoni: అలా చెప్ప‌డానికి సిగ్గు ప‌డ‌ను.. హ‌ర్షా భోగ్లేతో ధోని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ఓ అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్ట‌డంతో పాటు ఓ ర‌నౌట్‌, ఓ స్టంపింగ్‌లో భాగ‌స్వామ్యం అయ్యాడు. మ్యాచ్ అనంత‌రం క్రికెట్ వ్యాఖ్య‌త‌, విశ్లేష‌కుడు హ‌ర్షా భోగ్లేతో ప‌లు అంశాల‌పై ధోని మాట్లాడాడు.

MS Dhoni: అలా చెప్ప‌డానికి సిగ్గు ప‌డ‌ను.. హ‌ర్షా భోగ్లేతో ధోని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

MS Dhoni had a fun interaction with Harsha Bhogle (pic ipl twitter)

MS Dhoni: చెన్నైలోని చెపాక్ వేదిక‌గా శుక్ర‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad)తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఓ అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్ట‌డంతో పాటు ఓ ర‌నౌట్‌, ఓ స్టంపింగ్‌లో భాగ‌స్వామ్యం అయ్యాడు. మ్యాచ్ అనంత‌రం క్రికెట్ వ్యాఖ్య‌త‌, విశ్లేష‌కుడు హ‌ర్షా భోగ్లే Harsha Bhogle)తో ప‌లు అంశాల‌పై ధోని మాట్లాడాడు.

ఈ మ్యాచ్‌లో మ‌హేశ్ తీక్ష‌ణ బౌలింగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ మార్‌క్ర‌మ్ ఇచ్చిన క్యాచ్‌ను ధోని అద్భుత రీతిలో అందుకున్నాడు. దీనిపై హ‌ర్షా బోగ్లే మాట్లాడుతూ ఇలాంటి క్యాచ్‌లు అందుకోవ‌డం అంత సులువు ఏం కాద‌ని అన‌గా.. మ‌హేంద్రుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. వికెట్ కీప‌ర్లు గ్లోవ్స్ వేసుకుంటారు కాబ‌ట్టి క్యాచ్ ల‌ను సుల‌భంగా ప‌ట్టుకుంటార‌ని ఇప్ప‌టికీ చాలా మంది అభిమానులు భావిస్తుంటారు. వాస్త‌వానికి ఆ స‌మ‌యంలో తాను స‌రైన పొజిష‌న్‌లో లేనని చెప్పాడు. ఇది అద్భుత‌మైన క్యాచ్ అని తాను భావించిన‌ట్లు తెలిపాడు. “నాకు ఇప్ప‌టికి గుర్తు ఉంది. గ‌తంలో రాహుల్ ద్రావిడ్ ఓ సారి ఇలాగే క్యాచ్‌ను అందుకున్నాడు. కొన్ని సార్లు మ‌న శ‌క్తిసామ‌ర్థ్యాలు, నైపుణ్యాల‌తో సంబంధం లేకుండా ఇలాంటి క్యాచ్‌ల‌ను అందుకునే అవ‌కాశం వ‌స్తుంది.” అని ధోని చెప్పాడు.

IPL 2023, CSK vs SRH: కాన్వే జోరు.. హైద‌రాబాద్ బేజారు

ప్ర‌స్తుతం త‌న కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉంద‌ని ధోని తెలిపాడు. ఈ ద‌శను ఎంజాయ్ చేస్తున్న‌ట్లు చెప్పాడు. వ‌య‌సు పెరుగుతున్నా కొద్ది అనుభ‌వం వ‌స్తుంద‌న్నాడు. ఈ స‌మ‌యంలో హర్షా క‌లుగ‌జేసుకుని ‘నీకు ఇంకా వయసు మీద పడలేదు’ అని అన‌గా.. త‌న వ‌య‌స్సు పెరుగుతుంద‌ని చెప్ప‌డానికి అస్సలు సిగ్గుప‌డ‌న‌ని ధోని అన్నాడు. ధోని వ‌య‌స్సు ప్రస్తుతం 41 సంవ‌త్స‌రాలు అన్న సంగ‌తి తెలిసిందే.

MS Dhoni: చెపాక్‌లో చ‌రిత్ర సృష్టించిన ధోని.. తొలి వికెట్ కీప‌ర్‌గా అరుదైన ఘ‌న‌త‌

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ 17 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నుంచే క్రికెట్ ఆడ‌డం మొద‌లుపెట్టాడని, పాతికేళ్లు క్రికెట్ సేవ‌లు అందించాడ‌న్నారు. రెండేళ్ల త‌రువాత అభిమానుల మ‌ధ్య ఐపీఎల్ ఆడ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పాడు. కాగా.. మ్యాచ్‌లో అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టిన‌ప్ప‌టికి త‌న‌కు అవార్డు ఇవ్వ‌కపోవ‌డం ఏమీ బాగాలేద‌ని నిర్వాహ‌కుల‌ను ఉద్దేశించి మ‌హేంద్రుడు స‌ర‌దాగా అన్నాడు.