IPL 2023: ఆఖ‌రి బంతికి స‌మ‌ద్ స్ట్రైక్‌కు ఎలా వ‌చ్చాడు..? అలా రావొచ్చా..?

స‌మ‌ద్ క్యాచ్ ఇచ్చిన‌ప్పుడు ఇద్ద‌రు బ్యాట‌ర్లు ర‌న్‌ తీశార‌ని, అలాంట‌ప్పుడు చివ‌రి బంతికి స‌మ‌ద్‌ స్ట్రైకింగ్ ఎలా వ‌చ్చాడ‌నే అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.

IPL 2023: ఆఖ‌రి బంతికి స‌మ‌ద్ స్ట్రైక్‌కు ఎలా వ‌చ్చాడు..? అలా రావొచ్చా..?

Abdul Samad ( pic IPL teitter)

IPL 2023: జైపూర్ వేదిక‌గా ఆదివారం రాత్రి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(Rajasthan Royals), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి బంతికి హైడ్రామా చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒక్క నోబాల్ మ్యాచ్ ఫ‌లితాన్నే మార్చి వేసింది. హైద‌రాబాద్ విజ‌యానికి ఆఖ‌రి బంతికి 5 ప‌రుగులు అవ‌స‌రం కాగా సందీప్ శ‌ర్మ(Sandeep Sharma) బౌలింగ్‌లో అబ్దుల్ సమద్(Abdul Samad) షాట్ ఆడ‌గా లాంగాన్‌లో బంతిని బ‌ట్ల‌ర్(Jos Buttler) క్యాచ్ అందుకున్నాడు.

దీంతో ఫీల్డ‌ర్ల‌తో పాటు మైదానంలో ప్రేక్ష‌కులు సైతం రాజ‌స్థాన్ విజ‌యం సాధించింద‌ని సంబురాలు ప్రారంభించారు. వారి ఆనందం ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. క్ష‌ణాల్లో నో బాల్ సైర‌న్ వినిపించింది. మ‌ళ్లీ సందీప్ శ‌ర్మ బంతి వేయ‌గా ఈ సారి స‌మ‌ద్ సిక్స్ కొట్టి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను గెలిపించాడు. అయితే..స‌మ‌ద్ క్యాచ్ ఇచ్చిన‌ప్పుడు ఇద్ద‌రు బ్యాట‌ర్లు ర‌న్‌ తీశార‌ని, అలాంట‌ప్పుడు చివ‌రి బంతికి స‌మ‌ద్‌ స్ట్రైకింగ్ ఎలా వ‌చ్చాడ‌నే అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.

NoBall: పాపం సందీప్ శర్మ.. నోబాల్ ఎంతపని చేసింది.. ఏంటి అది నోబాల్ కాదా!

దీనిపై మ్యాచ్ అనంత‌రం స‌మ‌ద్ మాట్లాడుతూ.. ఒక‌రిని ఒక‌రం క్రాస్ చేసిన త‌రువాత అది నో బాల్ అనే విష‌యాన్ని గ‌మ‌నించాను. వెంట‌నే మార్కో జాన్సెన్ వెన‌క్కు రావాల‌ని కోరిన‌ట్లు చెప్పాడు. ఓ అభిమాని పోస్ట్ చేసిన వీడియో ప్ర‌కారం అంపైర్ ఫ్రీ-హిట్ సిగ్న‌ల్‌ను ఇచ్చేముందు బ్యాట‌ర్లు వెన‌క్కి వెళ్ల‌డం క‌నిపిస్తుంది. ఆఖ‌రి బంతి ఆడ‌డం కోసం స‌మ‌ద్ ప‌రుగు కంప్లీట్ చేయ‌కుండానే వెళ్లిపోయాడు.

దీనిపై ఓ వార్తాప‌త్రిక‌కు ఐపీఎల్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న అంపైర్ ఇలా వివ‌ర‌ణ ఇచ్చాడు. “సమద్ త్వరగా వెనక్కి వెళ్ళడానికి దానితో సంబంధం లేదు. అది నో బాల్. ఫీల్డర్ దానిని పట్టుకోగానే బాల్ డెడ్ అయింది. కొత్త నిబంధనల ప్రకారం.. లీగల్ డెలివరీలో క్యాచ్ పట్టే సమయానికి ఇద్దరు బ్యాట్స్‌మెన్ క్రాస్ చేసినప్పటికీ, కొత్త ఇన్-కమింగ్ బ్యాట్స్‌మన్ స్ట్రైక్‌ను ఎదుర్కొంటారు. అంతేకాని నాన్ స్ట్రైకర్ కాదు. అదే విధంగా.. నో బాల్‌లో, క్యాచ్ పూర్తయ్యేలోపు బ్యాట్స్‌మెన్ క్రాస్ చేసినా పర్వాలేదు. దీన్ని లెక్క‌లోకి తీసుకోరు. ప‌రుగులు ప‌రిగ‌ణ‌లోకి రావు. నోబాల్ వేసినందుకు ఒక ప‌రుగు ఇస్తారు. స్ట్రైక‌ర్ త‌దుప‌రి బంతిని ఎదుర్కొంటాడు.” అని చెప్పాడు.

IPL 2023, RR vs SRH: రాజ‌స్థాన్ కొంప‌ముంచిన నోబాల్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజ‌యం

దీని ప్ర‌కారం నోబాల్‌కు ఒక ప‌రుగు రావ‌డంతో హైద‌రాబాద్ విజ‌యానికి ఆఖ‌రి బంతికి నాలుగు ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. స‌మ‌ద్ సిక్స్ కొట్ట‌డంతో విజ‌యం హైద‌రాబాద్ సొంత‌మైంది.