IND vs WI 2nd ODI : భారత్ 181 ఆలౌట్.. Updates In Telugu

భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు ఆడ‌ లేదు. వారికి విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకున్నాడు.

IND vs WI 2nd ODI : భారత్ 181 ఆలౌట్.. Updates In Telugu

IND vs WI 2nd ODI

ముగిసిన భారత్ బ్యాటింగ్

వెస్టిండీస్ తో రెండో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. 40.5 ఓవర్లలో 181 పరుగులకే టీమీండియా ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్(55) హాఫ్ సెంచరీతో రాణించాడు. గిల్ 34 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో గుడాకేశ్ మోటీ, రొమారియో షెప్పర్డ్ తలో 3 వికెట్లు తీశారు.

సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్‌..

భార‌త్ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోతుంది. మోతీ బౌలింగ్‌లో(32.1వ ఓవ‌ర్‌) అథనాజే చేతికి సూర్య‌కుమార్ యాద‌వ్ చిక్కాడు. దీంతో భార‌త్ 148 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

 

జ‌డేజా ఔట్‌.. 

భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో(31.3వ ఓవ‌ర్‌) కారియా క్యాచ్ అందుకోవ‌డంతో ర‌వీంద్ర జ‌డేజా (10) ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భార‌త్ 146 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

 

ప్రారంభమైన మ్యాచ్‌.. క్రీజులో సూర్య,జడేజా

వ‌ర్షం త‌గ్గ‌డంతో మ్యాచ్ తిరిగి ఆరంభ‌మైంది. క్రీజులో సూర్య‌కుమార్ యాద‌వ్‌(13), ర‌వీంద్ర జ‌డేజా(6)లు ఉన్నారు. 28 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోరు 132/5.

 

మొద‌లైన వ‌ర్షం.. ఆగిన ఆట‌

రెండో వ‌న్డేకు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. వ‌ర్షం కురుస్తుండ‌డంతో ప్లేయ‌ర్లు గ్రౌండ్‌ను వీడారు. భార‌త్ ప్ర‌స్తుతానికి 24.1 ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి 5 వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులు చేసింది.

 

నిరాశ ప‌రిచిన శాంస‌న్‌

అందివ‌చ్చిన అవ‌కాశాన్ని సంజు శాంస‌న్ ఉప‌యోగించుకోలేక‌పోయాడు. కారీ బౌలింగ్‌లో (24.1వ ఓవ‌ర్‌) బ్రాండ‌న్ కింగ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 113 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. శాంస‌న్‌, పాండ్య‌లు వ‌రుస బంతుల్లో ఔట్ కావ‌డంతో భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది.

 

హార్థిక్ పాండ్య ఔట్‌..

కెప్టెన్ హార్థిక్ పాండ్య నిరాశ‌ప‌రిచాడు. సీల్స్ వేసిన (23.6వ ఓవ‌ర్‌) బంతిని షాట్ ఆడేందుకు య‌త్నించ‌గా బ్రాండ‌న్ కింగ్ చేతికి చిక్కాడు. దీంతో భార‌త్ 113 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

 

అక్ష‌ర్ ప‌టేల్ ఔట్‌.. 

భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. షెఫెర్డ్ బౌలింగ్‌లో (19.2) వికెట్ కీప‌ర్ కు క్యాచ్ ఇచ్చి అక్ష‌ర్ ప‌టేల్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 97 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

 

ఇషాన్ కిష‌న్ ఔట్‌..

దూకుడుగా ఆడుతున్న ఇషాన్ కిష‌న్‌(55) ఔట్ అయ్యాడు. షెఫెర్డ్ బౌలింగ్‌లో (17.3) అథ‌నేజ్ క్యాచ్ అందుకోవ‌డంతో ఇషాన్ కిష‌న్ ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 95 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

 

శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌

టీమ్ఇండియాకు మొద‌టి షాక్ త‌గిలింది. మోతీ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్(34) భారీ షాట్ కు య‌త్నించ‌గా జోసెఫ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో భార‌త్ 90 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

 

ఇషాన్ కిష‌న్ అర్థ‌శ‌త‌కం

యువ వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ త‌న ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. వ‌రుస‌గా రెండో వ‌న్డేలోనూ అర్థ‌శ‌త‌కం చేశాడు. మోతీ బౌలింగ్‌లో సింగిల్ తీసి 51 బంతుల్లో 5 ఫోర్ల‌తో అర్థ‌శ‌త‌కం పూర్తి చేశాడు. కాగా.. వ‌న్డేల్లో ఇషాన్‌కు ఇది 5వ హాప్ సెంచ‌రీ.

 

10 ఓవర్లు పూర్తి.. భారత్‌ స్కోర్‌ 49/0

ఓపెన‌ర్లుగా ఇషాన్ కిష‌న్‌, శుభ్‌మ‌న్ గిల్‌లు బ‌రిలోకి దిగారు. ఆరంభం నుంచి ఈ ఇద్ద‌రు ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమ్ఇండియా వికెట్‌ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. శుభ్‌మన్ (19), ఇషాన్ (26) లు క్రీజులో ఉన్నారు.

 

భారత తుది జ‌ట్టు : శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్య(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌కుమార్‌

 

వెస్టిండీస్ తుది జ‌ట్టు : బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, అలిక్‌ అథనేజ్‌, షై హోప్‌(కెప్టెన్‌), షిమ్రోన్ హెట్‌మయేర్, కీచీ కార్టీ, రొమారియో షెఫెర్డ్‌, యానిక్‌ కారీ, గుడాకేశ్‌ మోతీ, అల్జర్రీ జోసెఫ్‌, జయడెన్‌ సీల్స్‌

 

కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య‌.. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌కు విశ్రాంతి 

భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే ప్రారంభ‌మైంది. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు ఈ మ్యాచ్‌లో ఆడ‌డం లేదు. వారికి విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు.