Bollywood : ఇప్పటికైనా బాలీవుడ్ కరోనా కేర్ తీసుకుంటుందా??

గతంలోనే పార్టీల ద్వారా కరోనా స్ప్రెడ్ చేసుకున్న ఘనత బాలీవుడ్ కి ఉంది. తాజాగా మళ్ళీ ఇది రిపీట్ అయింది. రీసెంట్ గా కరణ్ జోహార్ గ్రాండ్ గా తన 50వ బర్త్ డే వేడుకలు..............

Bollywood : ఇప్పటికైనా బాలీవుడ్ కరోనా కేర్ తీసుకుంటుందా??

Bollywood :  కోవిడ్ ఎఫెక్ట్ తగ్గిపోయింది. పార్టీలు, పబ్ లు, ఆఫీసులు అన్నీ తెరుచుకున్నాయి. ఆంక్షలన్నీ అటుకెక్కాయి. ఇది టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్, అన్ని స్టేట్స్, అన్ని పరిశ్రమలలో కనిపిస్తున్న తీరు. మరి కరోనా అంతమైందా అంటే ఇంకా కరోనా కథ సుఖాంతం కాలేదని మాటి మాటికీ నిరూపిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. పార్టీలంటే రెడీగా ఉండే బాలీవుడ్ ఇప్పుడు వాటికి భయపడుతుంది.

కరోనా దెబ్బకు గతంలోనే విలవిలలాడింది బాలీవుడ్ ఇండస్ట్రీ. బిగ్ బి నుంచి అప్ కమింగ్ ఆర్టిస్ట్ వరకు ఎంతో మంది కరోనా భారిన పడ్డవారే. కొంతమంది కోలుకోగా, కొంతమంది మరణించారు. ఇప్పుడు మరోసారి కరోనా భయం బాలీవుడ్ లో వణుకు పుట్టిస్తుంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ కి కరోనా పాజిటివ్ రావడంతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లలేకపోయాడు. తర్వాత కత్రినా కైఫ్, ఆదిత్యా రాయ్ కపూర్, కార్తిక్ ఆర్యన్, షారుఖ్ ఖాన్.. లాంటి చాలా మంది ఆర్టిస్టులకు కరోనా ఎటాక్ అయ్యింది. దాంతో వాళ్లు నటిస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది.

Adivi Sesh : మేజర్ సినిమా హిట్ నానికి కలిసొస్తుందా??

గతంలోనే పార్టీల ద్వారా కరోనా స్ప్రెడ్ చేసుకున్న ఘనత బాలీవుడ్ కి ఉంది. తాజాగా మళ్ళీ ఇది రిపీట్ అయింది. రీసెంట్ గా కరణ్ జోహార్ గ్రాండ్ గా తన 50వ బర్త్ డే వేడుకలు నిర్వహించాడు. ఆ పార్టీకి హాజరైన దాదాపు 50 మెంబర్స్ కి కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలొచ్చాయి. ఇలా బాలీవుడ్ ప్రముఖులు వరసగా కరోనా భారిన పడుతుండటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ బెంబేలెత్తి పోతోంది. ప్రస్తుతానికైతే పార్టీలకు దూరంగా ఉంటున్నారు అక్కడి స్టార్స్. మరి ఇప్పటికైనా తెలుసుకొని కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకుంటూ, పార్టీలు చేసుకోకుండా కరోనా కేర్ ఏమైనా తీసుకుంటుందా బాలీవుడ్ చూడాలి.