Adivi Sesh : మేజర్ సినిమా హిట్ నానికి కలిసొస్తుందా??

మేజర్ సినిమాకి నాని కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? నాని నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విశ్వక్ హీరోగా హిట్ సినిమాని.............

Adivi Sesh : మేజర్ సినిమా హిట్ నానికి కలిసొస్తుందా??

Nani Major

Adivi Sesh :   అడవిశేష్ హీరోగా 26/11 దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మేజర్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాకి పేరు వస్తుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి అధిక లాభాలని తెస్తుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమాకి 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చి ఎప్పుడో బ్రేక్ ఈవెన్ సాధించి, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేసి భారీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడంతో ఈ సినిమాకి మరింత కలిసొచ్చింది.

 

అయితే మేజర్ సినిమాకి నాని కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? నాని నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విశ్వక్ హీరోగా హిట్ సినిమాని తెరకెక్కించాడు నాని. దానికి సీక్వెల్ గా హిట్ 2 సినిమాని తెరకెక్కించాడు నాని. ఈ సినిమా జులై 29న రిలీజ్ కానుంది. హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. దీంతో మేజర్ సినిమా హిట్ అవ్వడం, అడివి శేష్ కి మరింత పేరు రావడంతో నాని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట.

Nazriya : కులాంతర, మతాంతర వివాహాలపై నజ్రియా స్పందన..

మేజర్ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడం తన హిట్ 2 సినిమాకి కలిసొస్తుందని భావిస్తున్నాడు. దీంతో హిట్ 2ని హిందీలో కూడా రిలిజ్ చేసే ప్లాన్ లో నాని ఉన్నట్టు తెలుస్తుంది. మేజర్ సక్సెస్ తో హిట్ 2ని కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. దీంతో మేజర్ సక్సెస్ నానికి నిర్మాతగా బాగా కలిసొస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇక హిట్ సినిమాకి మొత్తం ఏడు సీక్వెల్స్ ఉన్నట్టు ఇటీవలే తెలిపాడు నాని.