Nazriya : కులాంతర, మతాంతర వివాహాలపై నజ్రియా స్పందన..

నజ్రియా మాట్లాడుతూ.. ''వివాహ బంధం విషయంలో కులమతాల పట్టింపులు ఉండకూడదు. నేను అయితే అదే నమ్ముతాను. ఇటీవల కొద్ది కొద్దిగా పరిస్థితులు...................

Nazriya : కులాంతర, మతాంతర వివాహాలపై నజ్రియా స్పందన..

Nazriya

Nazriya :  నాని హీరోగా, నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన సినిమా అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా జూన్ 10న ఈ సినిమా థియేటర్లలో రానుంది. జూన్ 9న అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ ఉండటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాని, నజ్రియా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేస్తున్నారు. తాజాగా నజ్రియా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కులాంతర, మతాంతర వివాహాలపై వ్యాఖ్యలు చేసింది. అంటే సుందరానికి సినిమాని కూడా మతాంతర వివాహం కాన్సెప్ట్ ని సీరియస్ గా కాకుండా కామెడీగా తీసినట్టు తెలుస్తుంది. దీంతో దీనిపై నజ్రియా స్పందించారు.

Adivi Sesh : మేజర్ పై విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్..

నజ్రియా మాట్లాడుతూ.. ”వివాహ బంధం విషయంలో కులమతాల పట్టింపులు ఉండకూడదు. నేను అయితే అదే నమ్ముతాను. ఇటీవల కొద్ది కొద్దిగా పరిస్థితులు మారుతున్నాయి. మీ సొంత కులం లేదా మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారన్న గ్యారెంటీ లేదు. ఏ బంధమైనా ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. అన్నిటికంటే ప్రేమే గొప్పది. మన పిల్లల తరానికైనా వివాహ బంధంలో ఈ కుల మతాల సమస్య ఉండదని, ఉండకూడదని అనుకుంటున్నాను. మా పెళ్లి విషయంలో ఇలాంటివేమీ జరగలేదు. చాలా సాఫీగానే ఓకే అయిపొయింది. కరోనా తర్వాత జీవితం చాలా చిన్నదని అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే ఈ కులాలు, మతాలు విషయాలపై మొండిగా ఉండటం అనవసరం అని అనుకుంటున్నాను” అని తెలిపింది.