Botcha Satyanarayana: ఈసారి డైరెక్ట్ ఎలక్షన్స్‌కు దూరంగా ఉంటారా? వారసులను బరిలోకి దింపుతారా? బొత్స వ్యూహం ఏంటి..
బొత్స ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచి ఆ మూడు సార్లు మంత్రిగా పనిచేస్తూ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం చీపురుపల్లి. పైగా బొత్స అనుచరులు, బంధు వర్గం అంతా ఇక్కడే ఉంటుంది.
- విజయనగరం సెంట్రిక్‌గా బొత్స రూట్ చేంజ్..!
- ఈసారి డైరెక్ట్ ఎలక్షన్స్‌కు దూరంగా ఉంటారా.?
- చీపురుపల్లిలో కూతురును పోటీ చేయించడం ఖాయమా.?
- వైసీపీ పవర్లోకి వస్తే కీరోల్ ప్లే చేసేలా బొత్స వ్యూహాలు
- తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకునే స్కెచ్
Botcha Satyanarayana: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న నేత. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పీసీసీ చీఫ్‌గా పని చేసి..సీఎం రేసులో కూడా ఆయన పేరు వినిపించింది. అలాంటి నేత రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి మళ్లీ మంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓడి..అసెంబ్లీలో లేకపోయినా..మండలిలో మాత్రం అన్నీ తానై నడిపించారు. కానీ హెల్త్ ఇష్యూస్ ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. మూడు దశాబ్దాలుగా విజయనగరం పాలిటిక్స్‌ను నేరుగా శాసిస్తున్న ఆయన..ఈసారి రూట్ మార్చబోతున్నారట. ఇంతకు ఎవరా సీనియర్ నేత? ఆయన తెరవెనుక మంత్రాంగం ఏంటి?
ఉత్తరాంధ్ర పొలిటికల్ పిక్చర్లో ఆయనో పాపులర్ లీడర్. నైన్టీస్‌లోనే రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన..పాలిటిక్స్‌లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా..సీనియర్ మోస్ట్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా..ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పాలిటిక్స్‌లో బొత్స సత్యనారాయణ మార్కే వేరు. ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎం రేసులో సత్తిబాబు పేరు వినిపించిందంటే ఆయన ఎంత సీనియర్ అండ్ పాపులర్ లీడరో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చిన బొత్స.. తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి..మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక వైసీపీ ఓడినప్పటి నుంచి..మండలిలో అన్నీ తానై అపోజిషన్‌ను నడిపిస్తున్నారు. అలాంటి వైసీపీ కీలక నేతను ఈ మధ్య అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన ఆయన..హెల్త్ ఇష్యూస్ నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నారట. ఈ పరిస్థితుల్లో యాక్టివ్ పాలిటిక్స్ చేసేంత రిస్క్ తీసుకోవద్దని ఫ్యామిలీ మెంబర్స్ ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నారట. రిలాక్స్ అవుతూ..రాజకీయ వారసురాలిగా కూతురు అనూషను బరిలోకి దించే ఆలోచన చేస్తున్నారట.
వచ్చే ఎన్నికల్లో రంగంలోకి వారసులు?
విజయనగరం జిల్లాలో వైసీపీకి సీనియర్ మోస్ట్ లీడర్‌గా ఉన్న బొత్స ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఉంటారనే ప్రచారం ఊపందుకుంది. ఆ మధ్య హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పటి నుంచి పొలిటికల్ యాక్టివిటీని తగ్గించారు బొత్స. సేమ్‌టైమ్ ప్రెస్మీట్లు..రాజకీయ విమర్శలకు కూడా గతంలోలా పదును పెట్టడం లేదు. బొత్స వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి చాలా రోజులు అవుతోందట. డాక్టర్ల సూచనల ప్రకారం విశ్రాంతి తీసుకుంటున్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి తన వారసులను రంగంలోకి దించాలని బొత్స చూస్తున్నారు.
బొత్స ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచి ఆ మూడు సార్లు మంత్రిగా పనిచేస్తూ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం చీపురుపల్లి. పైగా బొత్స అనుచరులు, బంధు వర్గం అంతా ఇక్కడే ఉంటుంది. ఆ సీటు మీద, చీపురుపల్లి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని వదులుకోవడానికి బొత్స ఇష్టంగా లేరట. అందుకే తన అనుచరులతో పార్టీ యాక్టివిటీ నడిపిస్తున్నారట. లేటెస్ట్గా వైసీపీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసింది. చీపురుపల్లిలో తన అనుచరులతో నిరసన కార్యక్రమం జరిగేలా బొత్స క్యాడర్, లీడర్లకు సూచనలు చేశారని అంటున్నారు. చీపురుపల్లిలో ఎక్కడా తన పార్టీ పట్టు తగ్గకూడదన్నట్లుగా బొత్స వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
చీపురుపల్లిలో కూతురు, విజయనగరం ఎంపీగా కొడుకు?
బొత్స కుమారుడు, కుమార్తె ఇద్దరూ డాక్టర్లే. ఇద్దరూ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారే. ఇక కుమార్తె అయితే చీపురుపల్లిలో వరుస పర్యటనలు చేస్తున్నారు. తండ్రితో పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆమె 2029 ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖాయమని అంటున్నారు. ఇక కుమారుడిని ఎంపీగా కంటెస్ట్ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మరోవైపు బొత్స కుటుంబంలో అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా పని చేసిన వారే ఉన్నారు. దూరపు బంధువుల నుంచి సన్నిహితుల వరకు..బొత్స సతీమణి, తమ్ముడు, మేనల్లుడు ఇల్లా అందరూ రాజకీయంగా అంతో ఇంతో పేరు తెచ్చుకున్నారు. అందుకే చీపురుపల్లిలో తన కూతురు, విజయనగరం ఎంపీగా తన కుమారుడితో పాటు..2029 ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలలో తన అనుకున్న వారికే సీట్లు దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారట.
లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు అమలైతే మారే ఈక్వేషన్స్‌ను బట్టి సిచ్యువేషన్ బేస్డ్గా నిర్ణయాలు తీసుకోబోతున్నారట. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి..వైసీపీ పవర్లోకి వస్తే అవసరమైతే మళ్లీ మండలికి వెళ్లి ఎప్పటిలాగే చక్రం తిప్పేలా బొత్స పావులు కదుపుతున్నారట. నెక్స్ట్ ఎలక్షన్స్ సెంట్రిక్‌గా బొత్స వేస్తున్న పొలిటికల్ స్కెచ్‌లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.
Also Read: అటు భూమా, ఇటు మంచు.. మౌనిక ఎంట్రీ ఏ పార్టీ నుంచి, పోటీ ఎక్కడి నుంచి..?
