Arvind Kejriwal : ఢిల్లీ సీఎం పంజాబ్ లో..పంజాబ్ సీఎం ఢిల్లీలో..ఏప్రిల్-1 తర్వాత రైతుల ఆత్మహత్యలుండవ్

వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ స్థానిక నేతలు

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం పంజాబ్ లో..పంజాబ్ సీఎం ఢిల్లీలో..ఏప్రిల్-1 తర్వాత రైతుల ఆత్మహత్యలుండవ్

Kejri

Arvind Kejriwal వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ స్థానిక నేతలు,కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతోపాటు పలు కీలక హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తాజాగా రెండు రోజుల పంజాబ్ పర్యటనకు వెళ్లిన కేజ్రీవాల్ గురువారం మాన్సాలో రైతులతో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ..రైతు ఆత్మహత్యల గురించి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయినా రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉండటం మనందరికి సిగ్గు చేటు. రైతులకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఏప్రిల్ 1 తర్వాత ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని హామీ ఇస్తున్నాను. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకుంటాం.. ఎంత దూరమైనా వెళ్తాం. పంజాబ్‌లో వ్యవసాయం గురించి మేం చాలా పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేశాం. మరో నెల రోజుల్లో నేను పంజాబ్‌కు మరోసారి వస్తాను. అప్పుడు మా ప్రణాళికను మీకు వివరిస్తాను అని పంజాబ్ రైతులతో కేజ్రీవాల్ అన్నారు.

పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి 117 స్థానాల్లో అభ్యర్థులు పోటిచేస్తారని..ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీపార్టీ అఖండ విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఇక, శుక్రవారం భటిండా వ్యాపారవేత్తలతో కేజ్రీవాల్ సమావేశం కానున్నారు.

మరోవైపు, అమరీందర్ సింగ్ ఢిల్లీలో ఉన్నారని ఎత్తిచూపుతూ..పంజాబ్ సీఎం ఢిల్లీలో,ఢిల్లీ సీఎం పంజాబ్ లో ఉన్నారు,మరోసారి! తప్పక చెప్పాలి, వారిలో ఒక్కరైనా తన సమయస్ఫూర్తితో ఉన్నారని అంటూ పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖర్ చేసిన ఓ ట్వీట్ పై గురువారం కేజ్రీవాల్ తనదైన స్టైల్ లో స్పందించారు. స్మైల్ ఐకాన్‌తో సునీల్ జాఖర్ ట్వీట్ ను రీట్వీట్ చేశారు కేజ్రీవాల్. కాగా, బుధవారం సాయంత్రం పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సునీల్ జాఖర్ ఆ ట్వీట్ చేశారు.

ALSO READ PM Modi : కేదార్‌నాథ్‌లో ఆదిశంక‌రాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ