Virata Parvam: విరాట పర్వం.. ఇక కష్టమేనా..?

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి చేసే సినిమాలు చాలా సెలెక్టివ్‌గా ఉండటంతో, ఆయన ఎంచుకునే కథలు కూడా బాగుంటాయని ప్రేక్షకులు నమ్ముతారు. ఇక ఈ హీరో నటించిన....

Virata Parvam: విరాట పర్వం.. ఇక కష్టమేనా..?

Will Virata Parvam Skip Theatrical Release Due To Delay

Virata Parvam: టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి చేసే సినిమాలు చాలా సెలెక్టివ్‌గా ఉండటంతో, ఆయన ఎంచుకునే కథలు కూడా బాగుంటాయని ప్రేక్షకులు నమ్ముతారు. ఇక ఈ హీరో నటించిన చిత్రం ‘విరాట పర్వం’ అప్పుడెప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలంగాణలోని 1990 నాటి ఘటనల ఆధారంగా తెరకెక్కించారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో రానా ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా, అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేయాలని చూసినా, కరోనా నేపథ్యంలో ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాను ఇప్పట్లో థియేటర్లలో రిలీజ్ చేసే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే వేసవి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు బడా చిత్రాలతో పాటు మీడియం రేంజ్ చిత్రాలు, చిన్న చిత్రాలు వరుసగా లైన్ కడుతున్నాయి.

Virata Parvam: తండ్రీ కొడుకుల రిలీజ్ వార్.. ఫైనల్ గా ఓటీటీలోనే?

ఈ నేపథ్యంలో విరాటపర్వం చిత్ర ఊసే లేకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలంటే మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే. ఈ మూడు నెలలు కూడా వరుసగా సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసుకుని ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు ఈ మూడు నెలలు థియేట్రికల్ రిలీజ్ కష్టమని అంటున్నాయి సినీ వర్గాలు.

Virata Parvam: విరాట పర్వం కాదు.. వాయిదాల పర్వం!

అయితే ఈ సినిమాను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేసేందుకు ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాత సురేష్ బాబు పలు ఓటీటీ ప్లాట్‌ఫాంలతో ఈ మేరకు చర్చలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయకపోగా, థియేట్రికల్ రిలీజ్ కోసమే వేచి చూస్తే మాత్రం, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉందని చిత్ర యూనిట్ కూడా ఆలోచిస్తుందట. మరి విరాటపర్వం చిత్రాన్ని వెండితెరపై చూస్తామా లేక ఓటీటీల చూస్తామా అని ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటనేది తెలియాలంటే ఫిలిం మేకర్స్ నుండి ఏదైనా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.