Virata Parvam: విరాట పర్వం కాదు.. వాయిదాల పర్వం!

యంగ్ హీరో రానా దగ్గుబాటి బాహుబలి సిరీస్ తరువాత విలక్షణమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ ఉన్నాడు.

Virata Parvam: విరాట పర్వం కాదు.. వాయిదాల పర్వం!

Virata Parvam

Virata Parvam: యంగ్ హీరో రానా దగ్గుబాటి బాహుబలి సిరీస్ తరువాత విలక్షణమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో రానా నటించిన ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. కాగా ఆయన కేవలం లీడ్ రోల్స్ మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లోనూ తనదైన మార్క్ వేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీలో పవన్‌తో పోటాపోటీగా నటించి మెప్పించాడు.

ఈ సినిమాలో రానా పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. అయితే రానా హీరోగా నటించిన ‘విరాట పర్వం’ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గతంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా, కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. ఇక కరోనా తగ్గుముఖం పడుతున్న తరుణంలో మిగతా హీరోలు తమ సినిమాలను వరుసబెట్టి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ విరాట పర్వం చిత్ర రిలీజ్ గురించిన ఊసేలేదు.

Virata Parvam: ఓటీటీ డీల్ క్యాన్సిల్.. ప్లాన్ ఎందుకు మారింది?

దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. తెలంగాణలోని 1990 కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైనా పలు కారణాల వల్ల ఈ సినిమా గురించిన ఎలాంటి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఇవ్వడం లేదు. ఇక విచిత్రం ఏమిటంటే.. ఈ సినిమా పూర్తి చేసిన తరువాత రానా మొదలుపెట్టిన ‘భీమ్లా నాయక్’ షూటింగ్ జరుపుకోవడం, సినిమా రిలీజ్ కావడం అన్నీ కూడా జరిగిపోయాయి.

Leader : మళ్ళీ రానా, శేఖర్ కమ్ముల కాంబినేషన్.. ‘లీడర్ 2’ త్వరలో??

అయినా కూడా విరాట పర్వం ఇంకా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయకపోవడం విడ్డూరంగా మారింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్‌లకు దర్శకుడు రిపేర్లు చేస్తున్నట్లు చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో రానాతో పాటు అందాల భామ సాయి పల్లవి నటన ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరి రావు తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి వాయిదాల పర్వంగా మారిన ‘విరాట పర్వం’ ఎప్పుడు వెండితెరపై కనిపిస్తుందో చూడాలి.