Poor-Quality Food: రైళ్లలో ఇలాంటి ఆహారమా అందించేది?: ఫొటో పోస్ట్ చేసి మహిళ ఆగ్రహం

రైళ్లలో సుదూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇష్టమైన ఆహార పదార్థాలు తినాలని భావిస్తాం. రైల్వే క్యాటరింగ్ సిబ్బందికి ఆర్డర్లు ఇస్తుంటాం. అయితే, వాళ్లు తెచ్చిన ఆహారం తినడానికి వీలు లేకుండా ఉంటే? తనకు ఇటువంటి అనుభవమే ఎదురైందని తాజాగా ఓ మహిళ ట్విట్టర్ లో తెలిపింది. తనకు ఇచ్చిన ఆహారం ఎలా ఉందో చూడండంటూ ఫొటో పోస్ట్ చేసింది. ఐఆర్సీటీసీ తీరును కడిగిపారేస్తూ వ్యాఖ్యలు చేసింది.

Poor-Quality Food: రైళ్లలో ఇలాంటి ఆహారమా అందించేది?: ఫొటో పోస్ట్ చేసి మహిళ ఆగ్రహం

Poor-Quality Food

Poor-Quality Food: రైళ్లలో సుదూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇష్టమైన ఆహార పదార్థాలు తినాలని భావిస్తాం. రైల్వే క్యాటరింగ్ సిబ్బందికి ఆర్డర్లు ఇస్తుంటాం. అయితే, వాళ్లు తెచ్చిన ఆహారం తినడానికి వీలు లేకుండా ఉంటే? తనకు ఇటువంటి అనుభవమే ఎదురైందని తాజాగా ఓ మహిళ ట్విట్టర్ లో తెలిపింది. తనకు ఇచ్చిన ఆహారం ఎలా ఉందో చూడండంటూ ఫొటో పోస్ట్ చేసింది. ఐఆర్సీటీసీ తీరును కడిగిపారేస్తూ వ్యాఖ్యలు చేసింది.

“ఐఆర్సీటీసీ అధికారులు ఎప్పుడైనా వారి సొంత ఐఆర్సీటీసీ అందించే ఆహార రుచిని ఆస్వాదించారా? మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు ఇటువంటి నాణ్యతలేని, రుచి లేని ఆహారాన్ని ఇచ్చారా? జైళ్లలో ఖైదీలకు ఇచ్చే ఆహారంలా దీని రుచి ఉంది. రోజురోజుకీ టికెట్ ధరలు పెంచుతున్నారు. అయినప్పటికీ, ఎప్పటిలాగే నాణ్యలేని ఆహారాన్నే ప్రయాణికులను అందిస్తున్నారు” అని భూమిక అనే మహిళ ట్వీట్ చేసింది.

పప్పు, కూర, చపాతీ, అన్నం ఎంత దారుణంగా ఉందో తెలుపుతూ దాని ఫొటోను కూడా భూమిక పోస్ట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ పై ఐఆర్సీటీసీ స్పందించింది. అందులోనూ తీవ్ర నిర్లక్ష్యం కనపడింది. ట్విట్టర్ లో భూమిక అనే మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెను “సర్” అని సంబోధిస్తూ ఐఆర్సీటీసీ రిప్లై ఇచ్చింది. “సర్… మీ పీఎన్ఆర్, మొబైల్ నంబరును డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపండి” అని పేర్కొంది. ఐఆర్సీటీసీ తీరు పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

KCR Public Meetings : నెక్ట్స్ ఏపీ, కర్ణాటక, ఢిల్లీ.. భారీ బహిరంగ సభలకు కేసీఆర్ ప్లాన్..!