bihar: ‘నేను దేవతను.. నా భర్తను విడిచిపెట్టకపోయారో’ అంటూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మహిళ
తాగుబోతు భర్తను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకెళ్ళడానికి ఓ మహిళ దేవత పేరుతో పోలీసులను భయపెట్టడానికి యత్నించింది. తాను సాక్షాత్తు దుర్గాదేవతనని, తన భర్తను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది.

Woman
bihar: తాగుబోతు భర్తను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకెళ్ళడానికి ఓ మహిళ దేవత పేరుతో పోలీసులను భయపెట్టడానికి యత్నించింది. తాను సాక్షాత్తు దుర్గాదేవతనని, తన భర్తను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది. పోలీసులను హాని కలిగించేలా పోలీసు స్టేషనులో చేతబడి చేస్తున్నట్లు నటించింది. ఆమె చేతుల్లో కర్ర, బియ్యం కూడా ఉన్నాయి. పోలీసులపై బియ్యం చల్లి శపిస్తున్నట్లు నానా నాటకాలు ఆడింది. ఈ ఘటన బిహార్‌లోని జముయీ జిల్లాలో చోటుచేసుకుంది.
Gardening: తోటపని చేస్తే మానసిక ఆరోగ్యం
ఓ కేసులో పోలీసుల అదుపులో ఉన్న తన భర్త కార్తీక్ మాంఝీని విడిపించడానికి సంజూ దేవి అనే మహిళ ఇలా దేవతనంటూ నానా హంగామా చేసింది. ఆమెను అదుపు చేయలేక పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. చివరకు సంజూ దేవిని మహిళా కానిస్టేబుళ్లు బయటకు తీసుకువెళ్ళిపోయారు. తన భర్తను విడిపించి తీసుకెళ్ళడానికే తాను ఇలా డ్రామా ఆడానని చివరకు సంజూ దేవి పోలీసుల ముందు అంగీకరించింది.