iPhone Lost in Sea : సముద్రంలో ఐఫోన్ పోగొట్టుకున్న మహిళ.. ఏడాది తర్వాత దొరికిన ఆ ఫోన్ కండిషన్ చూసి షాకైంది..!

iPhone Lost in Sea : సాధారణంగా ఏదైనా స్మార్ట్‌ఫోన్ పొరపాటున నీళ్లలో పడితే ఏమౌతుంది? అది పనిచేయదని అందరి తెలుసు.. కానీ, అన్ని స్మార్ట్ ఫోన్లు అలా కాదు.. ఆపిల్ ఐఫోన్ ఎంత కాస్ట్ ఉంటుందో అంతే వాటి కండిషన్ బాగుంటుందనడంలో సందేహం అక్కర్లేదు.

iPhone Lost in Sea : సముద్రంలో ఐఫోన్ పోగొట్టుకున్న మహిళ.. ఏడాది తర్వాత దొరికిన ఆ ఫోన్ కండిషన్ చూసి షాకైంది..!

Woman who lost her phone in sea 465 days ago finds it in working condition

iPhone Lost in Sea : సాధారణంగా ఏదైనా స్మార్ట్‌ఫోన్ పొరపాటున నీళ్లలో పడితే ఏమౌతుంది? అది పనిచేయదని అందరి తెలుసు.. కానీ, అన్ని స్మార్ట్ ఫోన్లు అలా కాదు.. ఆపిల్ ఐఫోన్ ఎంత కాస్ట్ ఉంటుందో అంతే వాటి కండిషన్ బాగుంటుందనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పుడు అదే ఒక మహిళ విషయంలో రుజువైంది. ఏడాది కిందట సముద్రంలో పొగట్టుకున్న ఐఫోన్ ఇప్పుడు దొరికేసరికి ఆమెలో ఎక్కడలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దాదాపు 465 రోజుల క్రితం సముద్రంలో తన ఫోన్‌ను పోగొట్టుకున్న హాంప్‌షైర్‌కు చెందిన ఒక మహిళ.. తన ఐఫోన్ వర్కింగ్ కండిషన్ చూసి షాకౌంది. ఆ ఐఫోన్ ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుంది.

అప్పట్లలో ఈ ఐఫోన్ బీచ్ సమీపంలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ ఐఫోన్ కుక్క వాకర్ ద్వారా గుర్తించారు. మహిళ సముద్రంలోకి వెళ్లిన సమయంలో ఐఫోన్ 8 ప్లస్‌ (iPhone 8 Plus)ను పోగొట్టుకుంది. ఆ ఫోన్ కోసం చాలా ఆశగా వెతికింది. కానీ, ప్రయోజనం లేకపోయింది. అయనప్పటికీ తన ఆశను వదులుకోలేదు. బీచ్ కు వెళ్లనప్పుడల్లా తన ఐఫోన్ దొరుకుతుందనే ఆశతో ముందుకు సాగింది. ఊహించిన విధంగా నవంబర్ 7న తన ఐఫోన్ మళ్లీ కంటపడటంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవు. సాధారణంగా ఏదైనా ఇతర ఫోన్ అయితే పనిచేయదు. కానీ, ఈ ఐఫోన్ మాత్రం వర్క్ చేయడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

Woman who lost her phone in sea 465 days ago finds it in working condition

Woman who lost her phone in sea 465 days ago finds it in working condition

యాహూ న్యూస్ ప్రకారం.. 39 ఏళ్ల క్లేర్ అట్‌ఫీల్డ్ గత ఏడాది ఆగస్టు 4న హాంప్‌షైర్‌లోని హవంత్ తీరంలో ప్యాడిల్‌బోర్డ్ నుంచి ఐఫోన్ 8 ప్లస్ పొగట్టుకుంది. కుక్కల వాకర్ ద్వారా కనుగొన్న ఐఫోన్ 8పై ఎక్కువ స్కాచ్‌లు లేవు. ఎందుకంటే.. ఆమె ఐఫోన్ కేసుతో ఉంది. అందులో మెడికల్ కార్డ్‌ కూడా ఉంది. ఆ కార్డు ద్వారా మహిళ వివరాలను గుర్తించారు. అయితే ఆ ఐఫోన్ ఇప్పటికీ పని చేయడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన ఐఫోన్ ఇప్పటికీ పనిచేస్తుందని చూసి నమ్మలేకపోతున్నానని క్లేర్ చెప్పుకొచ్చింది. కాకపోతే.. ఐఫోన్ వెనుక భాగం పూర్తిగా దెబ్బతిన్నది.

నీరు లోపలికి వెళ్లినప్పటికీ ఆ ఐఫోన్ అద్భుతంగా పనిచేస్తోంది. క్లైర్‌ దగ్గర ఇప్పుడు కొత్త ఫోన్ ఉంది. కానీ, తన పాత ఐఫోన్‌ను తిరిగి పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. iPhone 8 IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే Apple ఇంజనీర్లు కూడా ఐఫోన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నీటిలో ఒక ఏడాది పాటు ఈ ఐఫోన్ ఉన్నా పనిచేస్తుందని తెలిపారు. అలా అని ఐఫోన్ యూజర్లు ఎవరూ కూడా ఎక్స్‌పర్‌మెంట్ చేయొద్దని ఆపిల్ సూచించింది. మీ ఐఫోన్‌ను నీటిలో వేసేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Spam Calls Block : మీరు స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? మీ ఫోన్‌లో స్పామ్ కాల్స్ ఒకేసారి బ్లాక్ చేయొచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!