Less Courbons by Women : మహిళలు కీల‌క హోదాల్లో ఉంటే..గ్లోబల్ వార్మింగ్ త‌గ్గుతుంది

మహిళలు కీల‌క హోదాల్లో ఉంటే..గ్లోబల్ వార్మింగ్ త‌గ్గుతుంది అని ఓ సర్వే వెల్లడించింది.

Less Courbons by Women : మహిళలు కీల‌క హోదాల్లో ఉంటే..గ్లోబల్ వార్మింగ్ త‌గ్గుతుంది

Less Courbons By Women

Less Courbons by Women : కీల‌క హోదాల్లో ఆడ‌వాళ్లు ఉంటే.. భూతాపం త‌గ్గుతుంద‌ని ఓ స‌ర్వే అంచనా వేసింది. బ్యాంక్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ సెటిల్మెంట్స్ అధ్య‌య‌న నివేదిక‌ను ప్ర‌చురించింది. వాతావ‌ర‌ణ మార్పులకు, మ‌హిళ‌ల‌కు ఉన్న సంబంధంపై ఓ సర్వే నిర్వ‌హించగా..కార్బ‌న్ ఉద్గ‌రాల త‌గ్గింపులో మ‌హిళల‌ పాత్ర విశేషంగా ఉందని ఈ సర్వేలో తేలింది. ఆయా కంపెనీలో మ‌హిళ‌లు కీలక హోదాల్లో అంటూ మేనేజర్ స్థాయిలో ఉంటే.. దాని వ‌ల్ల కార్బ‌న్ ఉద్గ‌రాల విడుద‌ల త‌క్కువ‌గా ఉంటుంద‌ని ఈ సర్వే అంచ‌నా వేసింది.

Read more : Global Warming : మహా ముప్పు అంచున భూగోళం : UNO హెచ్చరిక

పురుషుల‌తో పోలిస్తే, మ‌హిళా మేనేజ‌ర్ల సంఖ్య 1 శాతం పెరిగితే, అప్పుడు కార్బ‌న్ ఉద్గ‌రాల విడుద‌ల 0.5 శాతం త‌గ్గుతుంద‌ని బ్యాంక్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ సెటిల్మెంట్స్ త‌న రిపోర్ట్‌లో వెల్ల‌డించింది. ఈ విషయం కోసం 24 ఆధునిక దేశాల్లో 2009 నుంచి 2019 వ‌ర‌కు 2000 జాబితా కంపెనీల‌ను విశ్లేషించారు. ఈ విశ్లేషణలో మహిళా మేనేజ‌ర్ల సంఖ్య పెరిగితే..కార్బ‌న్ ఉద్గ‌రాల విడుద‌ల త‌గ్గుతుంద‌ని తేల్చారు.

బ్యాంక్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ సెటిల్మెంట్స్ .. స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన‌ది. యేల్ట‌ర్ ఆల్టున్‌బాస్‌, లియోనార్డ్ గాంబ‌కోర్టా, అలిసో రిగేజా, గులియో వెలిసెగ్ ప‌రిశోధ‌కులు రిపోర్ట్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం మ‌హిళా మేనేజ‌ర్లు ఎక్కువ‌గా శ్ర‌ద్ధ చూపుతార‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. స‌మాజ శ్రేయ‌స్సు కోసం మ‌హిళ‌లే ఎక్కువ‌గా పాటుప‌డుతార‌ని, షేర్‌హోల్డర్ల ప్ర‌యోజ‌నాల క‌న్నా స‌మాజ బాగు కోసం వాళ్లు ఎక్కువ‌గా ఆలోచిస్తుంటార‌ని స్ట‌డీలో తెలిపారు.

Read more : Month Salary : నెల తిరగకుండానే..జీతం అయిపోతోంది..సర్వేలో ఆసక్తికర విషయాలు

కాగా..ఈ అధ్యయనాన్ని ప్రచురించిన బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ స్విస్ ఆధారిత ప్రపంచ కేంద్ర బ్యాంకుల పర్యవేక్షణ సంస్థ. కాబట్టి ఈ అధ్యయనానికి నమ్మదగిన విషయం అని విశ్లేషకులు భావిస్తున్నారు.