Women Catwalks : గుంతల రోడ్లపై క్యాట్ వాక్ చేసిన మహిళలు

గుంతలు పడ్డ రోడ్లపై మహిళలు క్యాట్ వాక్ చేసి నిరసన తెలిపారు. రోడ్ల పరిస్థితి మెరుగుపరచకపోతే పన్నులు కట్టేది లేదని స్పష్టం చేశారు.

Women Catwalks : గుంతల రోడ్లపై క్యాట్ వాక్ చేసిన మహిళలు

Bhopal Women Catwalks At Potholed Roads

Bhopal women catwalks at potholed roads : గుంతల మయంగా ఉన్న రోడ్లపై మహిళలకు క్యాట్ వాక్ చేసి నిరసనలు తెలిపారు.వర్షాకాలం వచ్చిదంటే చాలు రోడ్లన్నీ గుంతల మయం. వర్షాకాలానికి ముందు ఏదో వేశాంలే అన్నట్లుగా రోడ్లు వేస్తారు. గాడిద మొహాన బూడిత పామినట్లుగా ఏదో రోడ్లు వేసి చేతులు దులిపేసుకుంటారు. అవికూడా నాసిరకంగా ఉండటంతో ఒక్క వానకే గుంతలు పడిపోతుంటాయి. ఈ గుంతల రోడ్లపై వాహనాలు వెళ్లాలంటే ఉయ్యాల జంపాలా అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి.

ఈక్రమంలో భోపాల్ లో దారుణంగా తయారైన గుంతల రోడ్లుపై మహిళలు క్యాట్ వాక్ చేసి మహిళల వినూత్న నిరసన తెలిపారు. వర్షాకాలం దాదాపు వెళ్లిపోతున్నా ఇటువంటి రోడ్ల దుస్థితిపై అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని..వెంటనే మరమ్మతులు నిర్వహించాలని మహిళలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా..భోపాల్ లోని హోషంగాబాద్ రోడ్డు సమీపంలోని దానిష్ నగర్ కాలనీకి చెందిన మహిళలు గతుకుల రోడ్డుపై ఫ్యాషన్ మోడళ్ల తరహాలో ర్యాంప్ వాక్ చేసి గుంతల రోడ్ల విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మరమ్మత్తలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఇలా చేస్తే అయినా రోడ్ల పరిస్థితిని అధికారులు గుర్తిస్తారనే ఆశాభావాన్ని సదరు మహిళలు వ్యక్తంచేశారు. తమ కాలనీని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేర్చాలని, లేకపోతే ఆస్తి పన్నులు చెల్లించేది లేదని తెగేసి చెప్పారు.

కాగా ఈ గుంతల రోడ్ల సమస్యలు కేవలం భోపాల్ లోనేకాదు. మన హైదరాబాద్ వాసులకు కూడా తప్పటంలేదు. మంత్రి కేటీఆర్ రోడ్డుమీద గుంత కనిపిస్తే రూ.1000లు ఇస్తానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. కానీ రోడ్లప గుంతలు తప్ప సాఫీ రోడ్డే కనిపించని పరిస్థితి. ప్రజల వద్ద పన్నులు కట్టించుకునే ప్రభుత్వాలు రోడ్లు కూడా వేయించని పరిస్థితి. ఫలితంగా గుంతల రోడ్లపై ప్రయాణం చేస్తు అనారోగ్యాలపాలవుతున్న పరిస్థితుల్లో ఉన్నారు నగర వాసులు. అయిన పాలకులకు అవేమీ పట్టవు.గుంతల రోడ్లపై వెళుతున్న సమయంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయిన ఘటనలు కూడా అనేకం జరిగాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ పాలకుల్లో మాత్రం ఏమాత్రం చలనం ఉండదు.