Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​ షిప్స్​లో స‌త్తా చాటిన నీరజ్​ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​ షిప్స్​లో భారత అథ్లెట్​ నీరజ్​ చోప్రా జావెలిన్​ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో రజతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్‌​లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా అత‌డు నిలిచాడు. 2003లో పారిస్​ వరల్డ్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో లాంగ్​ జంప్​లో అంజు బాబి జార్జ్ కాంస్య ప‌తకం సాధించింది. మ‌ళ్ళీ ఇన్నేళ్ళ‌కు భార‌త్‌కు ప‌తకం ద‌క్కింది.

Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​ షిప్స్​లో స‌త్తా చాటిన నీరజ్​ చోప్రా

Neeraj Chopra

Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​ షిప్స్​లో భారత అథ్లెట్​ నీరజ్​ చోప్రా జావెలిన్​ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో రజతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్‌​లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా అత‌డు నిలిచాడు. 2003లో పారిస్​ వరల్డ్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో లాంగ్​ జంప్​లో అంజు బాబి జార్జ్ కాంస్య ప‌తకం సాధించింది. మ‌ళ్ళీ ఇన్నేళ్ళ‌కు భార‌త్‌కు ప‌తకం ద‌క్కింది. కాగా, ప్ర‌స్తుత ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​ షిప్స్​లో జావెలిన్​ త్రో ఫైనల్లో ఫైన‌ల్లో గ్రెనెడాకు చెందిన అండర్సన్​ పీటర్స్​ అగ్ర‌స్థానంలో నిలిచి, స్వ‌ర్ణ‌ప‌తకాన్ని కైవ‌సం చేసుకున్నాడు.

పీటర్స్​ విసిరిన బ‌ల్లెం తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరంలో ప‌డింది. నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరాడు. దీంతో అత‌డు ర‌జ‌తం గెలుచుకున్నాడు. ఇక మూడో స్థానంలో వద్లెచ్​ (88.09 మీటర్ల దూరం) నిలిచాడు. నీర‌జ్ చోప్రాతో పాటు మరో భారత త్రోయర్‌ రోహిత్‌ యాదవ్‌ కూడా ఫైనల్స్‌కు చేరుకున్నప్ప‌టికీ రాణించలేక‌పోయాడు. గతంలో ఒలింపిక్స్‌లో బంగారు ప‌త‌కం సాధించి నీరజ్​ చోప్రా మెరిసిన విష‌యం తెలిసిందే.