National Flag : వెయ్యి కిలోల బరువు.. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

అక్టోబర్ 2 మహాత్మాగాంధీ 152 వ జయంతి. దీన్ని పురస్కరించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ జెండాను లడఖ్‌లోని లెహ్‌ లో ఆవిష్కరించారు. లడఖ్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆర్‌కే బథుర్‌ ఈ త

National Flag : వెయ్యి కిలోల బరువు.. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

National Flag

National Flag : అక్టోబర్ 2 మహాత్మాగాంధీ 152 వ జయంతి. దీన్ని పురస్కరించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ జెండాను లడఖ్‌లోని లెహ్‌ లో ఆవిష్కరించారు. లడఖ్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆర్‌కే బథుర్‌ ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవనె దీనికి హాజరయ్యారు.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

ఖాదీ నూలుతో త‌యారు చేసిన ఈ జెండా సుమారు 225 అడుగుల పొడువు, 150 అడుగుల వెడల్పు ఉంది. దాదాపుగా వెయ్యి కిలోల బరువున్న ఈ త్రివర్ణ పతాకాన్ని ఇండియన్‌ ఆర్మీకి చెందిన 57 మంది ఇంజనీర్‌ సైనిక దళం తయారుచేసింది.

Hair Fall : చేప, చక్కర, గుడ్డు తెల్లసొన అధికంగా తింటున్నారా! అయితే అది రావటం ఖాయం?

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు. కొండపై ప్రదర్శనకు ఉంచిన జెండా, కొండ మీదుగా వెళ్తున్న హెలికాప్టర్లు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని లడఖ్‌లో ఆవిష్కరించడం దేశానికే గర్వకారణం. బాపు జ్ఞాపకార్థానికి, హస్తకళలను ప్రోత్సహించడానికి, దేశ గౌరవానికి ఇదే నా వందనం. జై హింద్‌. జై భారత్‌!’ అని పోస్టు చేశారాయన. జాతి పిత జయంతి రోజున మంచు కొండల మధ్య ఎగిరిన మువ్వన్నెల జెండా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.