Yadadri : యాదాద్రి పునః ప్రారంభోత్సవం.. చురుగ్గా ఏర్పాట్లు

విరాళాల కోసం ప్రత్యేకంగా టీ ఆప్ ఫోలియో మొబైల్ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Yadadri : యాదాద్రి పునః ప్రారంభోత్సవం.. చురుగ్గా ఏర్పాట్లు

Yadadri Temple

Updated On : December 17, 2021 / 10:36 AM IST

Yadadri Temple : యాదాద్రి పునర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. అతిరథ మహారథులకు ఆహ్వానాలు వెళ్లిపోతున్నాయి. ఫిబ్రవరిలోగా పెండింగ్ పనులు పూర్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్న ప్రభుత్వం.. విదేశాల్లో ఉండే భక్తులు విరాళాలు ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా యాప్‌ను లాంచ్ చేసింది. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు.

Read More : Oorvashi Rautela : ఒకప్పుడు కంటెస్టెంస్ట్.. ఇప్పుడు మిస్ యూనివర్స్ జడ్జి.. రికార్డు క్రియేట్ చేసిన బాలీవుడ్ నటి

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో.. ఆల‌య ప‌నుల పురోగ‌తి, మ‌హా సుదర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై మంత్రి స‌మీక్షించారు. యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

Read More : CM KCR : విద్యుత్ ఛార్జీల పెంపు..సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ- మ‌హా సుదర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల ఏర్పాట్లు, యాగ‌శాలల నిర్మాణం, రుత్వికుల‌కు బ‌స చేసేందుకు విడిదికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. అలాగే దాతల విరాళాల కోసం ప్రత్యేకంగా టీ ఆప్ ఫోలియో మొబైల్ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.