Yamaha EV Vehicles : భారతమార్కెట్లోకి యమహా ఈవీ వాహనాలు…ఎప్పుడంటే..

Yamaha
Yamaha EV Vehicles : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్ధ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించిన నేపధ్యంలో యమహా సంస్ధ భారత మార్కెట్లోకి ఈవీలను త్వరతగతిన తీసుకువచ్చే ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సహాకాల్లో మౌళిక సదుపాయల కల్పన, చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి వంటి కొన్ని కీలక అంశాల్లో సమస్యలను సంస్ధ గుర్తించింది.
యమహా సంస్ధ ఇప్పటికే జపాన్ లో ఈవీ వాహనాల తయారీకి సంబంధించిన ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసుకుని ఉంది. గత రెండేళ్ళుగా తైవాన్ వేదికగా ఈవీ వాహనాలను తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్జానం , నైపుణ్యం కలిగిన నిపుణలను యమహా కలిగి ఉంది. భారత్ తో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ఈవీ వాహనాల ఉత్తత్పిపై యమహా ప్రత్యేక దృష్టి సారించినట్లు యమహా గ్రూప్ ఇండియా ఛైర్మన్ మోటోఫుమి షిటారా స్పష్టం చేశారు.
భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు యమహా సిద్ధంగా ఉంది. అయితే ప్రభుత్వం ఈవీ తయారీ సంస్ధలకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తే మినహా తాము పూర్తిస్ధాయిలో ఈవీ మార్కెట్ పై దృష్టిసారిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుండి సరైన స్పందన వస్తే తాము ఇప్పటికే రూపొందించిన ఈవీ మోడళ్ళను భారత మార్కెట్లో అందుబాటులో ఉంచటంతోపాటు, ఇక్కడి నుండి వాటి తయారీని చేపడతామని యమహా సంస్ధ చెబుతుంది.