Yes Bank: రూ.300కోట్ల మోసం కేసు నిందితుడికి బెయిల్

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, రూ.300కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎండీ రానా కపూర్ కు బెయిల్ మంజూర్ అయింది. బ్యాంకుకు తప్పుడు నష్టాలను ఆపాదించి మనీ లాండరింగ్ కేసులో...

Yes Bank: రూ.300కోట్ల మోసం కేసు నిందితుడికి బెయిల్

Yes Bank

Yes Bank: యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, రూ.300కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎండీ రానా కపూర్ కు బెయిల్ మంజూర్ అయింది. బ్యాంకుకు తప్పుడు నష్టాలను ఆపాదించి మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన కపూర్ కు కొన్ని కండిషన్స్ తో బెయిల్ ఇష్యూ అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం వదిలిపారిపోకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం అతని పాస్ పోర్టును కూడా తాత్కాలికంగా సీజ్ చేయాలని ఆదేశించింది. రూ.5లక్షలను ప్రొవిషజనల్ ష్యూరిటీ కింద సబ్‌మిట్ చేయాలని తెలిపింది.

బిజినెస్‌మాన్ గౌతమ్ థపార్ తో పాటు మరో ఏడుగురికి కూడా బెయిల్ ఇష్యూ అయింది. కపూర్, థపార్ లకు బెయిల్ మంజూర్ అయినప్పటికీ ఇతర కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నందుకుగానూ జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంచారు.

Read Also: ఖాతాదారులకు ఊరట..సేవలు పునరుద్ధరణ

ఈ వ్యవహారంలో రూ.2,500 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. ఈ ఆస్తులు మొత్తం బ్యాంకు ఫౌండర్ రానాకపూర్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వార్ధవాన్‌లకు చెందినవి.

మనీలాండరింగ నిరోధక (PMLA)చట్టం ప్రకారం ముంబైలోని పెద్దార్ రోడ్‌లోని ఓ బంగ్లా, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని 6 ఫ్లాట్లు, ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్‌లోని 48 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అలాగే న్యూయార్క్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్‌లో రెండు కమర్షియల్ ప్రాపర్టీలతో పాటు ఐదు లగ్జరీ కార్లు ఉన్నాయి.